తాగేసి స్టార్ హీరోయిన్ తో ఆ బాడీగార్డ్..?

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలియా భట్ కు తాజాగా ఊహించని పరిణామం ఎదురైందట. మొన్న రాత్రి 3 గంటల వరకు ఏదో మీటింగ్ ఉండటంతో ఆలియా భట్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో టైమ్ స్పెండ్ చేసిందట. ఆ తర్వాత తన ఫ్లాట్ కు వెళదామని తన బాడీగార్డ్ కి ఫోన్ చేస్తే.. అతగాడు చాలాసేపటి తర్వాత మందు కొట్టి వచ్చాడని సమాచారం. ఈ విషయం తెలియక.. ఆలియా భట్ తన బాడీగార్డ్ ను పక్కన కూర్చోనిస్తే, వెంటనే అతగాడి నోటి నుంచి మందు వాసన రావడంతో ఆలియా ఒక్కసారిగా షాక్ కు గురైందట.
అనంతరం సదరు బాడీగార్డు మత్తులో అలా తూలుతూ ఉంటే.. తాను మాత్రం గుండెలు అరచేతిలో పెట్టుకున్నానని, ఆ టైమ్ లో చాలా భయం వేసిందని, అప్పుడు అరిస్తే మత్తులో అతడు ఏమైనా చేస్తాడని అనిపించి కామ్ గా ఉండిపోయానని ఆలియా భట్ చెప్పుకొచ్చింది. ఇకపోతే, తెల్లారి ఈ విషయం తెలుసుకున్న ఆలియా భట్ తల్లి సోని రజ్దాన్ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బాడీగార్డ్ ను పనిలో నుంచి తీసేసిందని సమాచారం. ఏదిఏమైనా, హీరోయిన్ భావనపై ఎటాక్ జరిగినప్పటి నుంచి హీరోయిన్ లకు ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు ఎక్కువయ్యాయని అంటున్నారు. మన అనుకున్న వాళ్లే అలా బిహేవ్ చేస్తుండటంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఫీలవుతున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఆలియా భట్ కే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే.. మిగిలిన వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.