తెలుగు వాళ్లపై తెలుగు నటుడు దారుణం

టాలీవుడ్ నటుడు, ఆ మధ్య ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న అజయ్ ఘోష్ తాజాగా చెన్నైలో జరిగిన ‘తప్పు తాండా’ ఆడియో లాంచ్ లో మాట్లాడుతూ టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ స్టోరీలోకి వెళితే, తాజాగా అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. ఆస్కార్ కోసం సెలక్ట్ అయిన ‘విసారణై’ సినిమాలో నేను నటించానని, నా మాతృ ఇండస్ట్రీ అయిన తెలుగు ఇండస్ట్రీ దానిని గుర్తించలేదని, కానీ తమిళవారు మాత్రం గుర్తించారని, ఈ సినిమాలో నటించినందుకు నాకు ఫోన్లు చేసి తమిళ మీడియా వారు ఇంటర్వ్యూలు కూడా అడిగారని చెప్పుకొచ్చాడు. అలాగే నాకు తెలుగు కంటే కూడా తమిళ ఇండస్ట్రీలో పనిచేయాలనే ఆశగా ఉండేదని, నేను కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడం వలన తెలుగు ఇండస్ట్రీలో ఇబ్బంది పడ్డానని, నాకు కెమెరా ముందు యాక్ట్ చేయడం వచ్చు గాని, కెమెరా వెనుక యాక్టింగ్ చేయడం రాదని అజయ్ ఘోష్ పేర్కొన్నారు.

అంతేకాకుండా తమిళ పీపుల్ గ్రేట్ అంతే అంటూ.. గ్రేట్ తమిళ ఇండస్ట్రీ లో వెట్రిమారన్ నాకు అవకాశం ఇచ్చారని, ఒక కొత్త జన్మ ఇచ్చారని, ఇక్కడ వీరికి బిల్డప్ లు లేవని, తమిళ జనాలకు సోషల్ అండ్ పొలిటికల్ అవగాహన చాలా ఎక్కువని ఆకాశానికి ఎత్తేశాడు. అదే విధంగా విసారణై సినిమా కోసం వెట్రిమారన్ తో 28 రోజులు పనిచేశానని, ఆ వర్క్ చాలా గ్రేట్ అని, అందుకే శిరస్సు వంచి తమిళ ఇండస్ట్రీ వారికి పాదాభివందనం చేస్తున్నానని సెలవిచ్చారు. చివరగా చెన్నైలో ఖాళీగా ఉన్న ఆటోవాళ్ళు పేపర్ చదువుతుంటారని, అదే మా దగ్గరైతే పాన్ తింటూ ఉంటారని.. అలాగే అక్కడి సాంబార్ తింటే మోషన్స్ అవుతాయని, ఇక్కడ తింటే వావ్ అని తమిళ ఇండస్ట్రీని పొగుడుతూ తెలుగు ఇండస్ట్రీపై, ఇక్కడ వాళ్లపై అజయ్ ఘోష్ దారుణమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  దీంతో ఇప్పుడు టాలీవుడ్ వర్గాలు ఈ విలన్ పై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి తెలుగు నటుడై ఉండి మనపైనే ఇలాంటి కామెంట్స్ చేసిన ఆయనపై సినీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.