నిజమా.. బాలయ్యను ఛాన్స్ అడిగిన అమలాపాల్!

సౌత్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్ నుంచి విడాకులు తీసుకున్నాక కెరీర్ పైనే సీరియస్ గా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళ, మలయాళం భాషల్లో అమలాపాల్ వరుస సినిమాలను లైన్ లో పెట్టింది. అయితే, తెలుగులో మాత్రం అమలాపాల్ ఇప్పటివరకు సరైన ఆఫర్ దక్కించుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్టుతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని అమలాపాల్ గట్టిగానే ప్లాన్ చేస్తోందట. ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలయ్య – పూరీ జగన్నాథ్ కాంబో సినిమా కావడం విశేషం.

అయితే, ఇప్పుడు ఈ క్రేజీ సినిమాలో నటించే ఛాన్స్ అమలాపాల్ దగ్గరకు రావడం అటుంచి.. కావాలని అమలాపాలే ఈ బాలయ్య 101వ సినిమాలో హీరోయిన్ గా నటించాలని ఆశపడుతుందని తెలియడం హాట్ టాపిక్ గా మారింది. ఆ స్టోరీలోకి వెళితే, తొలిసారిగా పూరీ – బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం డైరెక్ట్ గా బాలయ్యనే అమలాపాల్ అప్రోచ్ అయ్యిందని ఇన్నర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఇది పూరీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. ఈ ఛాన్స్ తనకే ఇమ్మని బాలయ్యను కోరిందట.

ఇంతకుముందే పూరీ డైరెక్షన్లో ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అమలాపాల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పరిచయంతోనే ఇటు పూరీని కూడా బాలయ్య సినిమా కోసం అమలాపాల్ సంప్రదిస్తుందట. ముఖ్యంగా బాలయ్యనే ఎక్కువగా అమలాపాల్ రిక్వెస్ట్ చేస్తుందని వెబ్ మీడియాలో స్టోరీలు చక్కర్లు కొడుతుండటం హాట్ టాపిక్ అవుతుంది. ఇదే అనుకుంటే.. ఈ సినిమా ఛాన్స్ తనకిస్తే ఎంత గ్లామర్ షో కైనా రెడీ అంటూ పూరీకి అమలాపాల్ చెప్పిందని వార్తలు వినిపిస్తుండటం సంచలనంగా మారింది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని.. అమలాపాల్ నిజంగానే బాలయ్య సినిమా కోసం ఎదురెళ్ళితే మాత్రం.. ఆ ఛాన్స్ తనకే దక్కే అవకాశాలు ఎక్కువగానే ఉండొచ్చేమో.