ఆ సినిమా చూసి దెబ్బలు తిన్న తెలుగమ్మాయి

టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే ఎక్కువగా సక్సెస్ అయి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తెలుగమ్మాయి అంజలి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోలీవుడ్ యంగ్ హీరో జై ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయేలా కనిపిస్తోన్న అంజలి.. ఇప్పటికే జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి సినిమాలతో ఇక్కడ కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే, తాజాగా అంజలి తన చిన్ననాటి జ్ఞాపకాల్లో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పి ఆకట్టుకుంది. ఆ విషయంలోకి వెళితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అంజలి మాట్లాడుతూ.. అమ్మాయిలు కాలేజీ ఎగ్గొట్టి సినిమా చూడటానికి వెళ్లడం అంటే ఇప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోరు గాని, ఓ ఇరవై ఏళ్ళ కిందట అయితే అది మామూలు విషయం కాదని, నాకు బాగా అనుభవం అయిందని చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా పదో తరగతి బాగా చదివేటప్పటికి నా కళ్ళు నెత్తిమీదకు వచ్చాయని, కాలేజీ చదివే రోజుల్లో ‘నువ్వే కావాలి’ సినిమా రిలీజై యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుందని, అందుకే ఆ సినిమాను ఎలాగైనా చూడాలని కాలేజీ బంక్ కొట్టానని అంజలి తెలిపింది.

అయితే, నువ్వే కావాలి సినిమా చూడటానికి ఒక రోజు కాలేజీ బంక్ కొట్టి కొంచెం ఎక్కువ దూరంలోనే ఉన్న సినిమా హాల్ కు ఎవరూ చూడరనే ధైర్యంతో ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లానని చెప్పిన అంజలి.. తీరా సినిమా చూసి ఇంటికి వచ్చే లోపే ఆ న్యూస్ బయటకు వచ్చేయడంతో మా వాళ్ళు నన్ను చితక్కొట్టేశారని చెప్పడం విశేషం.

దీంతో తర్వాత మళ్ళీ ఎప్పుడూ కాలేజీ బంక్ కొట్టి సినిమాకు గాని, షికారుకు గాని వెళ్లలేదని అంజలి చెబుతూ.. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో అంటూ పేర్కొనడం నిజంగా విశేషమే. ఏదిఏమైనా, అప్పట్లో నువ్వే కావాలి సినిమా చూసి అంజలి ఇంట్లో దెబ్బలు తినడం సంథింగ్ స్పెషల్ అనే అనాలి.
Follow US
https://www.facebook.com/myfirstshow/