లీకైన వీడియో.. శ్రియతో బాలయ్య అలా..?

balakrishna 101 movie video leaked

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. శ్రియ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు ‘ఉస్తాద్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో శ్రియతో పాటు మరో ఇద్దరు హాట్ బ్యూటీస్ బాలయ్యకు జోడీగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ను పూరీ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రధానంగా గ్యాంగ్ స్టర్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పూరీ తన స్టైల్లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా లీకై బయటకు వచ్చిన ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన వీడియో అయితే, ఎప్పటిలాగే పూరీ మార్క్ ను చూపిస్తోంది. కొంచెం షాకింగ్ గా అనిపిస్తున్నా.. షూటింగ్ స్పాట్ లో బాలయ్య – శ్రియ ల మధ్య తెరకెక్కిస్తోన్న సీన్స్ ఇలా వీడియో రూపంలో బయటకు వచ్చేయడం సినీవర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ఇక లీకైన వీడియో విషయానికి వస్తే.. బాలయ్య సరికొత్తగా పూరీ మార్క్ హీరోగా బాగానే ఉన్నాడని అనిపిస్తోంది. ఈ సందర్బంగా శ్రియను బాలయ్య బ్రతిమాలుకుంటున్న సీన్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే శ్రియ ఇదంతా వేస్ట్ అన్నట్లు బాలయ్య నుంచి దూరంగా వెళ్లిపోవడం ఆకట్టుకుంది. దీంతో బాలయ్య చిరాకుతో కళ్ళజోడు విసిరికొట్టి అక్కడే ఉండిపోవడం పూరీ మార్క్ హీరోయిజాన్ని చూపిస్తోంది. ఇదే సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న సాంగ్ ఈ సినిమా లోనిదే అనే విషయం అర్థమైపోతుంది. ఆ సాంగ్ కూడా క్యాచీగా పూరీ స్టైల్లోనే ఉండటం గమనార్హం. మొత్తానికి యంగ్ లుక్ లో బాలయ్య అదరగొట్టేశాడనే అనాలి. అలాగే బాలయ్య లాంటి హీరోను కూడా హీరోయిన్ ను వేధించే వాడిగానే మార్చేసిన పూరీని మెచ్చుకోవాల్సిందే. ఇకపోతే, ఈ సీన్ ఓ సాంగ్ లో భాగంగా వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి భారీ షెడ్యూల్ పోర్చుగల్ లో జరుపుకుంటుందని సమాచారం. ఈ తాజా వీడియో కూడా ఇప్పుడు అక్కడి నుంచే లీకైందని తెలుస్తోంది.

వీడియో :