చిరు- బాలయ్య.. ఇలా చేస్తే ఎంత బావుటుంది?

 
ఈ సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలు బాక్సాఫీసు వార్ కి రెడీ అవుతున్నాయి. చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.  చిరంజీవి ఖైదీ నెం.150, బాల‌కృష్ణ గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ఱి.. రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే. చిరు 150వ సినిమా అయితే, బాల‌య్యకు ఇది వందో చిత్రం. ఈ ఇద్దరు ఒక రోజు గ్యాప్ లో అంటే బాల‌య్య 12న వ‌స్తుంటే, అంత‌కంటే ముందు 11న చిరు రంగంలోకి దిగిపోతున్నారు, ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. 
 
బాలయ్య-చిరులు మాత్రం మా ఇద్దరి సినిమాలు ఆడాలని కోరుకుంటున్నారు. మొన్న మెగా ఈవెంట్ లో చిరు, బాలయ్య అల్ ది బెస్ట్ చెబితే.. నిన్న బాలయ్య, చిరు సినిమాకి తనవంతుగా అల్ ది బెస్ట్ చెప్పేశారు. అయితే ఈ ఇద్దరి విడివిడి నామమాత్రపు స్టేట్మెంట్లను ఇరు వర్గాల ఫ్యాన్స్ అంత సిరియస్ గా తీసుకొనేలా కనిపించడం లేదు. ఎంత కాదనుకున్నా ఫ్యాన్స్ మాత్రం ఈ సంక్రాంతి బాల‌య్య, చిరుల మ‌ధ్య పోటీగానే భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నానా హంగామా చేస్తున్నారు. అందరు ఫ్యాన్స్ అని కాదు. ఇందులో కొందరు హార్ట్ కోర్ ఫ్యాన్స్ అనవసరమైన ఉద్వేగానికిలోనాయి ఒకరిపై ఒకరు బురదజల్లుకునే పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. దింతో ఆటోమేటిక్ గా ఇరు హీరోలు మాటపడాల్సిసివస్తుంది. 
 
అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చేయాలంటే బాలయ్య-చిరు ఈ విధంగా ఓ స్టెప్ తీసుకోవచ్చు. విడివిడి ప్రకటనలు కాకుండ.. ఒకే వేదికపైకి వచ్చి.. తమ మధ్య ఎలాంటి పోటీ లేదని, సంక్రాంతి సినిమా పండగని, ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సీజన్ లో ప్రత్యేక ఆదరణ ఉటుందని,  రెట్టింపు ఆనందం నింపడానికే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చామని, ఇది సినిమా పండగ తప్పితే ఎలాంటి పోటి అనకోవడం లేదని ఇద్దరూ కలసి చెబితే ఎంతో బావుటుంది. 
 
ఇది కాకుండా ఇలా కూడా చేయవచ్చు. ఒకరి సినిమాకి మరొకరు.. అంటే, బాలయ్య సినిమాకి చిరు, చిరు సినిమాకి బాలయ్య వెళ్లి ఆద్యంతం సినిమా వీక్షించి ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటే.. అబ్బా.. ఉహించుకోవడానికే యమా థ్రిల్లింగ్ గా వుంది. నిజానికి ఇది జరగదు. కాని ఇలా చేస్తే మాత్రం ఓ గొప్ప సంస్కృతి, అభిమానుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం నింపినట్లువుటుంది.