గోవాలో అక్టోబర్ 6న చైతూతో సమంత..?

Chaitu Samantha marriage October 6th Goa
అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టడానికి స్టార్ హీరోయిన్ సమంత చాలా ఆతృతగా ఎదురుచూస్తోందని ఈ మధ్య వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంటే యంగ్ హీరో నాగచైతన్యతో ప్రేమాయణం, నిశ్చితార్థం తర్వాత.. ఆ పెళ్లి కూడా తొందరగా జరిగిపోతే బాగుండు అని ఈ ప్రేమపక్షులు కోరుకుంటున్నాయట. ఈ క్రమంలోనే చైతూతో సమంత పెళ్లి అప్పుడంటూ ఆ తర్వాత అంటూ చాలానే డేట్లు వినిపించాయి గాని.. అవేమీ నిజం కాలేదు. ఈ మధ్యలో అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అవడంతో.. వీళ్ళ పెళ్లి తొందరగా చేయబోతున్నారనే టాక్ కూడా వినిపించింది.
మరీ ముఖ్యంగా ఈ ఏడాదే వీరి పెళ్లి జరగనుందని వార్తలు హల్ చల్ చేశాయి. అంతేకాకుండా చైతూ సమంతల పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో యూరప్ లో ఓ చోట జరగనుందని మొన్నటివరకు ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ, ఇప్పుడు చైతూ-సమంతల పెళ్లి ఇండియాలోనే జరగనుందని.. ఓ డేట్ అండ్ ప్లేస్ తో సహా తాజా అప్డేట్ ఒకటి సినీ సర్కిల్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయింది. ఆ న్యూస్ లోకి వెళితే, ఈ అక్టోబర్ 6న చైతూతో సమంత పెళ్లి గోవాలో బీచ్ సాక్షిగా జరగనుందని ఇప్పుడు ఇన్నర్ సర్కిల్ లో న్యూస్ హల్ చల్ చేస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ పెళ్లి కోసం చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయని.. ఎంగేజ్మెంట్ కోసమే ప్రత్యేకమైన చీరలు నేయించుకుని ధరించిన సమంత ఇప్పుడు ఈ పెళ్లి కోసం భారీగానే ప్రణాళికలు రచిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చైతూ కూడా ఈసారి అందరినీ సర్ప్రైజ్ చేయడానికి భారీగానే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇకపోతే, చైతూ – సమంతలు ఇప్పుడు చేస్తోన్న సినిమాలు చాలావరకు అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉండటంతో.. ఆ డేట్ కే ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ అప్పటికి చేతిలో ఏమైనా సినిమాలు ఉంటే, కాస్త బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసేసుకోవాలని నిర్ణయించుకున్నారట. మరి ఈ గోవాలో అక్టోబర్ 6న పెళ్లి అనే విషయం ఏమైనా నిజమవుతుందా? లేక ఇది కూడా రూమర్ గానే మిగిలిపోతుందా? అనేది చూడాలి.