వెండితెరపైకి చంద్రబాబు నాయుడి 'చంద్రోదయం'!....................

వెండితెరపైకి చంద్రబాబు నాయుడి ‘చంద్రోదయం’!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెండితెరపై అలరించడానికి రెడీ అవుతున్నారు. అయితే, ఆయన హీరోగా చేయడం లేదు.. కనీసం నటించడం లేదు కూడా. మరి వెండితెరపై ‘చంద్రోదయం’ ఏమిటని అనుకుంటున్నారా.. ఆ విషయంలోకి వెళితే, సీఎం చంద్రబాబు నాయుడు పాలన ఇతివృత్తంగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ‘చంద్రోదయం’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను విజయవాడకు చెందిన కార్పొరేటర్ మల్లిఖార్జున యాదవ్ నిర్మిస్తుండగా.. ఒంగోలుకు చెందిన పసుపులేటి వెంకటరమణ కథ, మాటలు, పాటలతో పాటు దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గతంలో తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత ఆయన ప్రతిపక్ష నేతగా సాగించిన పోరాటాలు, తిరిగి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం వంటి విషయాలను హైలైట్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాను ఆగష్టు 4న ఒంగోలులో ఏపీ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంఛనంగా ప్రారంభించనున్నారని అధికారిక సమాచారం. ఇదిలా ఉంటే, ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ పొలిటికల్ లైఫ్ స్టోరీపై కూడా సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. మరి ఈ పొలిటికల్ సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై ఏమేరకు విజృంభిస్తాయో చూడాలి.

వెండితెరపైకి చంద్రబాబు నాయుడి ‘చంద్రోదయం’!
0 votes, 0.00 avg. rating (0% score)