చెర్రీ-మణిరత్నం మూవీ ఆగడానికి కారణం ఎవరు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ సినిమాతో గోదావరి జిల్లాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో ఓ సినిమా చేసేందుకు చెర్రీ రెడీగా ఉన్నాడని మొన్నటివరకు వార్తలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలోనే ‘చెలియా’ స్టోరీని మణిరత్నం ముందుగా చెర్రీకే వినిపించాడని టాక్ ఉంది. అయితే, అప్పుడు ఆ కథపై అంతగా నమ్మకం లేకపోవడంతో నాకు సెట్ కాదని చెప్పి చెర్రీ తెలివిగా తప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తీరా ‘చెలియా’ రిలీజై భారీ డిజాస్టర్ గా నిలవడంతో చెర్రీ ఆలోచనలో పడ్డాడని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. కానీ, మణిరత్నంకు మాట ఇచ్చి ఉండటంతో.. కమిట్మెంట్ కారణంగా ఆయన డైరెక్షన్లో మూవీ చేయక తప్పదని చెర్రీ ఇప్పుడు ఫిక్స్ అయినట్లు ఇన్నర్ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అంతేకాకుండా మణిరత్నం డైరెక్షన్లో ఓ క్లాసిక్ మూవీ చెయ్యాల్సిందేనని చెర్రీ నిర్ణయించుకున్నాడట. ఈ కారణంగానే తాజాగా చెర్రీకి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గట్టిగా క్లాస్ పీకారని తెలియడం ఇప్పుడు హాట్ న్యూస్ అయింది. ఆ స్టోరీలోకి వెళితే, తాజాగా చిరు.. వరుస హిట్స్ తో నిలకడగా రాణిస్తున్నప్పుడు ప్రయోగాలు చేసినా పర్వాలేదు గాని, ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్నప్పుడు మణిరత్నంతో ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదని, కొత్తదనం పేరుతో ప్రయత్నాలు చేస్తే ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుందని చెర్రీకి డైరెక్ట్ గానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు డాడీ ఇచ్చిన క్లాస్ దెబ్బకు ఇచ్చిన మాటను పక్కనపెట్టి మణిరత్నం సినిమాను ఎలా తప్పించుకోవాలో అని చెర్రీ ఆలోచిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. దీంతో చిరు కారణంగా చెర్రీ – మణిరత్నం సినిమా ఇప్పటికి ఆగిపోయినట్లేనని అంటున్నారు. మరి ఫ్యూచర్ లోనైనా ఈ మెగా మణిరత్నం కాంబో పట్టాలెక్కుతుందేమో చూడాలి.