జనతా గ్యారేజ్ తో చంద్రబాబుకు ఉన్న లింకేంటి..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ అంచనాలతో వస్తోన్న సినిమా ‘జనతా గ్యారేజ్’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ గ్యారేజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరగడంతో పాటు ఇప్పటికే అన్నివైపుల నుంచీ పాజిటివ్ టాక్ రావడంతో రిలీజ్ ముందే హిట్ గ్యారెంటీ అనేలా కనిపిస్తోంది. ఇకపోతే ఇప్పుడు ఈ ‘జనతా గ్యారేజ్’ కు ఓ సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని వెబ్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతుండటం విశేషం. అది కూడా ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన ప్రభుత్వం కారణంగా సినిమా సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.

ఆ స్టోరీలోకి వెళితే, 2003లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘సింహాద్రి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా రిలీజ్ అప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండటం, అదే సమయంలో గోదావరి పుష్కరాలు రావడం జరిగాయట. ఇప్పుడు ఇంచుమించు అలాగే ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండటం, కృష్ణా పుష్కరాలు జరగడంతో ఇది సెంటిమెంట్ గా వర్కౌట్ అయ్యేలా ఉందని అటు ఫ్యాన్స్, ఇటు మీడియా వర్గాలు కూడా స్టోరీలు రాసేస్తున్నారు. ముఖ్యంగా ఈ చంద్రబాబు ప్లస్ పుష్కరాల సెంటిమెంట్ తో ఎన్టీఆర్ కు ‘సింహాద్రి’ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో.. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’ అంతకుమించి హిట్ ఇస్తుందని వార్తలు హల్ చల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి చూద్దాం చంద్రబాబు సెంటిమెంట్ ‘జనతా గ్యారేజ్’ ను ఏ రేంజ్ కు తీసుకువెళుతుందో.