దిల్ రాజుకి చిరాకు తెప్పిస్తున్న సాఫ్ట్ డైరెక్టర్ 

Dil Raju Tense Varun Tej Fidaa Movie

టాలీవుడ్ లో ఈ మధ్య సినిమాల నిర్మాణం పక్కా ప్లానింగ్ తో వేగంగా పూర్తయిపోతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో పెద్ద సినిమాల సంగతి పక్కనపెడితే, మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తొందరగా పూర్తయిపోతున్నాయి. ఇందులో సింపుల్ లవ్ స్టోరీస్ అయితే రెండు మూడు నెలల్లోనే కంప్లీట్ చేసేస్తున్నారు. ఇక పూరీ జగన్నాథ్ లాంటి డైరెక్టర్ అయితే కమర్షియల్ సినిమాను కూడా చాలా తక్కువ టైమ్ లో పూర్తి చేసి వావ్ అనిపిస్తాడు. ఆ తర్వాత సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా పర్లేదు గాని.. అనుకున్న టైమ్ కల్లా పూర్తి చేస్తే అది నిర్మాతలకు పెద్ద రిలీఫ్ గా ఉంటుంది. ఈ విషయంలో పక్కా క్లారిటీతో ఉంటాడు కాబట్టే.. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఎక్కువగా సూపర్ హిట్ లు కొడుతూ దూసుకుపోతున్నాడని అంటూ ఉంటారు.
కానీ, ఆ దిల్ రాజుకే ఇప్పుడు ఈ విషయంలో ఓ సాఫ్ట్ డైరెక్టర్ చిరాకు తెప్పిస్తున్నాడని వార్తలు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అయింది. ఆ సాఫ్ట్ డైరెక్టర్ మరెవరో కాదు.. క్లాస్ సినిమాలతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఈ క్లాస్ డైరెక్టర్ దిల్ రాజు నిర్మాణంలో వరుణ్ తేజ్ హీరోగా, మలయాళం బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా ‘ఫిదా’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమా షూటింగ్ చాలా నెలలుగా సాగుతూనే ఉండటం, ఇంకా తెరకెక్కించాల్సిన భాగం కూడా చాలానే ఉండిపోవడం దిల్ రాజుకి చిరాకు తెప్పిస్తుందట. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి దాదాపు నాలుగు నెలలు అవుతుండటం.. ఓ లవ్ స్టోరీ కోసం ఇంత టైమ్ తీసుకోవడంతో దిల్ రాజు ఫ్రస్టేట్ అవుతున్నాడని అంటున్నారు. ఇలా అనుకున్న టైమ్ కి కరెక్ట్ గా అవ్వకుండా.. ఫిదా షూటింగ్ డిలే అవుతున్నందుకు ప్రస్తుతం దిల్ రాజుకి ఎలా ఫీలవ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో దిల్ రాజు, శేఖర్ కమ్ములకే తెలియాలి.