షాకింగ్.. పూరీ జగన్నాథ్ కి కౌన్సిలింగ్..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా ఉంటూనే, తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే పూరీ రైటింగ్ స్కిల్స్ గురించి, టేకింగ్ స్కిల్స్ గురించి.. ఆ మాటకొస్తే పూరీ టాలెంట్ గురించి ఇప్పుడు చెప్పడం అంటే వెంటనే అయ్యే పని కాదు. అయితే, ఈ మధ్య పూరీ తీసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతుండటం.. టెంపర్ మినహా మిగతావన్నీ రొటీన్ సినిమాలుగానే నిలిచి పూరీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం చూశాం. దీంతో పూరీ కూడా ఇప్పుడు హిట్ కొట్టాలనే ఒత్తిడిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా యంగ్ స్టార్ హీరోలందరూ మొహం చాటేస్తున్న టైమ్ లో.. సీనియర్ స్టార్ హీరోలతో పూరీ సినిమాలు చేయడానికి రెడీ అవడం ఇంకా ఒత్తిడిని కలిగిస్తోందట. అందులోనూ ఇప్పుడు బాలయ్యతో పూరీ తన కొత్త సినిమాను స్టార్ట్ చేయడం.. ఆ తర్వాత వెంకటేష్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉండటంతో.. ఇప్పుడు పూరీకి సంబంధించి ఓ షాకింగ్ రూమర్ సినీ సర్కిల్ లో హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ఆ రూమర్ లో ఎంత నిజముందో తెలియదు గాని.. సీనియర్ స్టార్స్ తో ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ప్రెజర్ పూరీని మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేస్తోందని, అందుకే ఇప్పుడు పూరీ ఓ సైక్రియాట్రిస్ట్ ను కలిసి కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడని ఆ న్యూస్ హల్ చల్ చేస్తుండటం షాకింగ్ గా మారింది.
అయితే, ఇలా రీఫ్రెష్ అవడం కోసం, మెంటల్ బ్యాలెన్స్ కోసం సెలబ్రిటీలు, క్రియేటివ్ పీపుల్స్ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది ఎప్పుడూ ఉండేదే అని తెలుసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా తమ సినిమాలు ఫెయిల్ అయినప్పుడు, పర్సనల్ గా డిస్టర్బ్ అయినప్పుడు.. కొంతమంది ఇంట్లోంచి కూడా బయటకు రాకుండా ఉండిపోతారు. అలాంటప్పుడే ఇలాంటి కౌన్సిలింగ్ లు తీసుకుని తిరిగి ఎప్పటిలాగే ఫుల్ ఎనర్జీతో దూసుకుపోతూ ఉంటారు. ఇదే సమయంలో కొంతమందైతే ఫారిన్ ట్రిప్స్ లాంటివి వెళ్తూ రీఫ్రెష్ అవుతూ ఉంటారు. ఇలానే పూరీ కూడా సమయం దొరికినప్పుడల్లా బ్యాంకాక్ వెళుతూ ఉంటాడని అందరికీ తెలుసు. మరి ఇప్పుడు పూరీ అలా కాకుండా కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడంటే మాత్రం.. కాస్త ఆలోచించాల్సిందే.