ప్రేమ + పొగరు.. ‘గుంటూరోడు’ ఊరమాస్ 

టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ‘గుంటూరోడు’ గా వస్తున్నాడని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తాజాగా ‘గుంటూరోడు’ ట్రైలర్ ను మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ ను చూస్తే.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గాని మన మనోజ్ కు పూనేశాడా అని అనిపించకమానదు. అంతలా మనోజ్ తన ఊరమాస్ అవతారం చూపించాడు. ముందుగా ‘గుంటూరోడు’ క్యాప్షన్ కు తగ్గట్లు ‘ప్రేమలో పడ్డాడు’ అనే కాన్సెప్ట్ ను అందంగా చూపిస్తూ ‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అందానికి లవ్ లో పడిపోయిన మనోజ్ ను చూపించిన విధానం ట్రైలర్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత ట్రైలర్ మొత్తం ప్రేమ కోసం మనోజ్ తన పొగరు చూపిస్తూ చేసిన యాక్షన్ సీన్స్ నిండిపోయాయి. ప్రధానంగా ఊరమాస్ అవతారంలో మనోజ్ తన ‘కరెంట్ తీగ’ కు మించిన హై వోల్టేజ్ చూపించడానికి గట్టిగానే ప్రయత్నించడం విశేషం.

ఇక ఈ ట్రైలర్ లో బాగా మెచ్చుకోవాల్సిన విషయం ఎస్కె సత్య డైరెక్షన్ తో పాటు రైటింగ్ స్కిల్స్ గురించి. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కు తగ్గ డైలాగ్స్ రాసి సత్య బాగానే మెప్పించడానికి ట్రై చేశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ట్రైలర్ లో.. ‘ప్రయత్నిస్తే పోయేదేముందండి.. బానిస సుంకళాలు తప్ప’.. ‘భూమ్మీద దేవతలు తిరుగుతుంటే యుద్దాలు చేయాలి బావా’.. ‘సత్తా.. సత్తా ఉన్నోడిని చూస్తే చావుకి కూడా పడిపోద్ది.. నా కొడకా’ అంటూ మనోజ్ చెప్పిన డైలాగ్స్ మాస్ జనం చేత విజిల్స్ వేయిస్తున్నాయి. అలాగే కోట శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్స్, సంపత్ విలనిజం, రాజేంద్ర ప్రసాద్ సెంటిమెంట్స్ సినిమాకు హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఇక శ్రీ వసంత్ అందించిన సంగీతం బాగున్నా కూడా.. మరో సినిమా మ్యూజిక్ ను గుర్తుచేస్తుండటం గమనార్హం. మొత్తానికి ప్రేమ + పొగరు కలుపుకుని ‘గుంటూరోడు’ ఊరమాస్ క్యారెక్టర్ తో వస్తున్నాడని ట్రైలర్ ను చూస్తేనే అర్థమైపోతుంది. మరి ట్రైలర్ ఆకట్టుకున్న రేంజ్ లో సినిమా ఆకట్టుకుంటుందో లేదో త్వరలోనే చూడాలి.

ట్రైలర్ :