తెలుగులో హన్సిక రెమ్యునరేషన్ కు షాక్ అవ్వాల్సిందే..! హన్సికనే హీరోయిన్

తెలుగులో హన్సిక రెమ్యునరేషన్ కు షాక్ అవ్వాల్సిందే..!

తమిళంలో స్టార్ హీరోయిన్ గా స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తోన్న హన్సిక మొత్వాని తెలుగులో మాత్రం తక్కువగానే మెరుస్తోన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘పవర్’ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. మొన్నటివరకు అసలు తెలుగు సినిమావైపే చూడలేదు. ఇక ఇప్పుడేమో యంగ్ హీరో మంచు విష్ణు సరసన ‘లక్కున్నోడు’ సినిమాలో హన్సిక నటిస్తోంది. ఈ జోడీ గతంలో దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాల్లో నటించి.. హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. అందుకే ఇప్పుడు ‘లక్కున్నోడు’ సినిమా కోసం హన్సికనే హీరోయిన్ గా తీసుకున్నారు. దీనికోసం హన్సికకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా ఇన్నర్ టాక్ ప్రకారం.. హన్సికకు ఈ లక్కున్నోడు ఏకంగా కోటి రూపాయలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఆ స్థాయి రెమ్యునరేషన్ అందుకునేంత క్రేజ్ కోలీవుడ్ లో హన్సికకు ఉండొచ్చేమో గాని.. తెలుగులో హన్సికకు కోటి రూపాయలు అంటే షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి హన్సిక అంత మొత్తానికి ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే, ‘గీతాంజలి’ డైరెక్టర్ రాజ్ కిరణ్ తెరకెక్కిస్తున్న ఈ ‘లక్కున్నోడు’ ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో నోట్ల కట్ల మధ్యలో ఉన్న హీరోహీరోయిన్లు బాగానే ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ ‘లక్కున్నోడు’ ను ఎంవీవీ సినిమా  బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగులో హన్సిక రెమ్యునరేషన్ కు షాక్ అవ్వాల్సిందే..!
0 votes, 0.00 avg. rating (0% score)