జూ. బాల‌య్య ఈయ‌నేన‌ట‌!

మ‌న‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలుసు. ఈ జూనియ‌ర్ బాల‌య్య ఏమిటి??  అనుకొంటున్నారా?  బాల‌య్య ఫ్యాన్స్ ఓ క‌మెడియ‌న్‌ని జూనియ‌ర్ బాల‌య్య అంటూ బిరుదులు ఇచ్చేశార్ట‌. బాల‌య్య త‌ర‌వాత ఆ స్థాయిలో ఆ త‌ర‌హా డైలాగులు చెప్పేది నువ్వే అంటూ కితాబులు ఇచ్చేశార్ట‌. ఆ క‌మెడియ‌న్ ఎవ‌రో కాదు. థ‌ర్టీ ఇయ‌ర్స్ ఫృథ్వీ.  క‌మెడియ‌న్ గా ఇప్పుడు తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొన్నాడు ఫృథ్వీ. బ్ర‌హ్మానందం లాంటి స్టార్ క‌మెడియ‌న్లు ఫృథ్వీ దెబ్బ‌కు డ‌ల్ అయిపోయారు. బాల‌య్య డైలాగుల్ని ఇమిటేట్ చేస్తూ పాపుల‌ర్ అయిన ఫృథ్వీకి ఓసారి బాల‌య్య  ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. `మా బాల‌య్య‌ని ఇమిటేట్ చేయ‌డం మానుకో` అంటూ గట్టిగా చెప్పారు. దాంతో ఫృథ్వీ కూడా కాస్త త‌గ్గాడు. బాల‌య్య అంటే త‌న‌కు ఎన‌లేని అభిమాన‌మ‌ని, ఇక మీద‌ట బాల‌య్య‌ని ఇమిటేట్ చేయ‌న‌ని మాట ఇచ్చాడు.
అయితే ఫృథ్వీ పుట్టిన రోజు సంద‌ర్భంగా కొంత‌మంది బాల‌య్య ఫ్యాన్స్ ఫృథ్వీకి ఫోన్ చేసి విషెష్ చెప్పార్ట‌. అందులో కొంత‌మంది జూనియ‌ర్ బాల‌య్య‌వు నువ్వే అంటూ కితాబులు ఇచ్చార్ట‌. బాల‌య్య‌ని ఇమిటేట్ చేయండి.. ఫ‌ర్వాలేదు.. అంటూ గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశార‌ట‌. ఈ  విష‌యాల‌న్నీ ఫృథ్వీనే ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.  ఇంకే ముంది???  ఫృథ్వి మ‌ళ్లీ బాల‌య్య‌ని ఇమిటేట్ చేయ‌డం మొద‌లెట్టేయ‌డం ఖాయం.