అమితాబ్ ప్లేస్‌లో ఐశ్వ‌ర్యారాయ్‌?

Iswarya place Amithab
అమితాబ్ ప్లేస్‌లో ఇంకో హీరో అంటూ ఎవ‌రిదో ఓ పేరు చెబితే విన‌డానికి అందంగా ఉంటుంది. విచిత్రంగా  అమితాబ్ ప్లేస్‌లో ఐశ్వ‌ర్య ఏంటి అంటారా? అక్క‌డే ఉంది మ‌రి విష‌యం. నిజంగానే అమితాబ్ ప్లేస్‌లో ఐశ్వ‌ర్యని ఎంపిక చేయ‌డంపై దృష్టిపెట్టింద‌ట ఓ నిర్మాణ  సంస్థ‌.  ఐశ్వ‌ర్య‌నా లేదంటే మ‌రో హీరోయినా అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ… అమితాబ్ ప్లేస్‌లో ఓ లేడీ అన్న‌ది మాత్రం ఖాయమ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే… `కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి` అన‌గానే అప్ర‌య‌త్నంగా గుర్తుకొచ్చేది బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌నే. ఆయ‌న‌కీ, ఆ షోకీ మ‌ధ్య ఓ అవినాభావ సంబంధం ఉంది.  ప్రేక్ష‌కుల్ని ఆద్యంతం ఉత్కంఠ‌కి గురిచేస్తూ షోని  ర‌క్తి క‌ట్టించిన ఘ‌న‌త ఆయ‌న‌ది.  ఆ షోతో బుల్లితెర‌ని వెండితెర‌కంటే ఎక్కువ‌గా పాపుల‌ర్ చేశాడు అమితాబ్ బ‌చ్చ‌న్‌.   సొంత సంస్థ ఏబీసీ కార్పొరేష‌న్‌కి తీవ్ర న‌ష్టాలపాలై, అమితాబ్ ఆర్థికంగా కుదేలైన ప‌రిస్థితుల్లో ఆయ‌న్ని మ‌ళ్లీ  లేచి నిల‌బ‌డ్డాడంటే కార‌ణం కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి అనే అని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతుంటాయి. అలాంటి షో నుంచి అమితాబ్ బ‌చ్చ‌న్  కొన్నాళ్ల‌పాటు బ‌య‌టికి రానున్న‌ట్టు తెలిసింది. యాజ‌మాన్యం ఓ లేడీతో ఆ షోని కండ‌క్ట్ చేయించాల‌ని డిసైడ్ అవ్వ‌డమే అందుకు కార‌ణంగా తెలుస్తోంది. అమితాబ్ బ‌చ్చ‌న్ ప్లేస్‌లో ఐశ్వ‌ర్యారాయ్‌ని కానీ, లేదంటే మాధురీ దీక్షిత్‌ని ఎంపిక చేయాల‌ని షో నిర్వాహ‌కులు ఆలోచిస్తున్నార‌ట‌. ఐశ్వ‌ర్య ఒప్పుకొంటే ఆమే ఖాయ‌మ‌ని కూడా చెబుతున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు. మ‌రి బిగ్ బీ రేంజ్‌లో ఆయ‌న కోడ‌లు బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందా? అనేది చూడాలి. కార్య‌క్ర‌మాన్ని ఎలా నిర్వ‌హిస్తుందో ఏంటో కానీ… గ్లామ‌ర్‌కి మాత్రం కొద‌వుండ‌దు. ఎందుకంటే ఐష్ అంటేనే గ్లామ‌ర్‌.