JD Chakravarthy Amma Rajashekar Ugram Movie Poster Launch

జెడి, అమ్మరాజశేఖర్ల ఉగ్రం పోస్టర్ విడుదల

JD Chakravarthy Amma Rajashekar Ugram Movie Poster Launch

JD Chakravarthy Amma Rajashekar Ugram Movie Poster Launch

నక్షత్ర మీడియా పతాకంపై జెడి చక్రవర్తి, అక్షిత జంటగా అమ్మ రాజశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘ఉగ్రం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇటీవలే ‘ఉలవచారు’ రెస్టారెంట్‌లో ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెడి చక్రవర్తి, అమ్మ రాజశేఖర్‌, హీరోయిన్‌ అక్షిత, బెనర్జీ, గౌతం రాజు, చమ్మక్‌చంద్ర, ఆజాద్‌, జబర్ధస్త్‌ ఆర్కే తదితరులు పాల్గొన్నారు. పోస్టర్‌ని ఎమ్మెల్యే వేణుగోపాలచారి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ మాట్లాడుతూ..’మా గురువు గారు జెడి చక్రవర్తి హీరోగా నేను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఉగ్రం’ అనే టైటిల్‌ని ఖరారు చేశాము. ఇదొక వెరైటీ సబ్జెక్ట్‌. ఎస్‌.ఎస్‌. థమన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంకా 10 రోజులు షూటింగ్‌ జరుపుకుని, వచ్చే నెల మొదటివారంలో ఫ్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని జరుపనున్నాం…అని అన్నారు.

‘ఉగ్రం’ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, కెమెరా: అంజి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ప్రొడ్యూసర్‌: నక్షత్ర రాజశేఖర్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అమ్మ రాజశేఖర్‌.

జెడి, అమ్మరాజశేఖర్ల ఉగ్రం పోస్టర్ విడుదల
0 votes, 0.00 avg. rating (0% score)