షాక్:రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో మహేష్?

టాలీవుడ్ ‘బాహుబలి’ ని తలదన్నేలా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని రీతిలో మహాభారతాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం ఇప్పటికే తెలిసే ఉంటుంది. అది కూడా ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాండామూజమ్ నవల ఆధారంగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కావడం విశేషం. దేశంలోని ప్రధాన భాషలన్నింటిలోనూ రిలీజ్ కానున్న ఈ సినిమాను ఎన్నారై పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి రూ.1000 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. అందుకే ఇండియాలోని ప్రముఖ స్టార్ హీరోలలో కొంతమందినైనా ఈ సినిమాలో భాగం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్ సర్కిల్ లో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఆ స్టోరీలోకి వెళితే, మహాభారతంలో భీముని పాత్ర కోణంలో, పాండవుల కథ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తుండగా.. ఇందులో మోహన్ లాల్ ప్రధానమైన భీముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇప్పుడేమో ఇందులో శ్రీకృష్ణుడిగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు పేరును పరిశీలించారట. అంతేకాకుండా ఈ విషయాన్ని మహేష్ వరకు కూడా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పట్ల మహేష్ కూడా ఆసక్తిగానే ఉన్నట్లు ఇన్నర్ సర్కిల్లో అప్పుడే టాక్ వినిపించేస్తోంది.
మరోవైపు, శ్రీకృష్ణుడి పాత్రపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ చాలా ఆసక్తిగా ఉన్నాడని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. మరి అలాంటప్పుడు ఎవరిని ఫైనల్ చేస్తారంటే.. చెప్పడం కొంచెం కష్టమే. ఇదే సమయంలో ఈ భారీ మహాభారతం ప్రాజెక్టులో భీష్ముడి పాత్రకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అర్జునుడి పాత్రకు హృతిక్ రోషన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలియడం విశేషం. మరి ఈ లెక్కన ఇలా ఇండియన్ లోని సూపర్ స్టార్లనే మెయిన్ గా తీసుకుందాం అనుకుంటే.. నిజంగానే 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమనిపిస్తుంది. మరి ఓ కలలా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. మొత్తం కాకపోయినా మన మహేష్ బాబు శ్రీకృష్ణుడి మేటర్ నిజమైతే మాత్రం.. ఇక్కడ ఫ్యాన్స్ కు పండుగే.
శ్రీకృష్ణుడిగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు.
Mahesh Babu Mohanlal Mahabharat