atrk

వంశీపైడిప‌ల్లికి మ‌హేష్ అండా దండా?

PVP-Vamsi rift

ఊపిరి సినిమా వ‌ల్ల రూ.20కోట్లు న‌ష్టం వ‌చ్చింది.. దీనికి ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి స‌మాధానం చెప్పాలి… అంటూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ వంశీపైడిప‌ల్లిపై ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు… వంశీ మ‌హేష్ కోసం త‌యారు చేసిన క‌థ‌పై త‌మ సంస్థ‌కు కూడా హ‌క్కులున్నాయని పేర్కొంటూ ఫిల్మ్ ఛాంబ‌ర్‌కీ, ద‌ర్శ‌కుల సంఘానికీ ఆయ‌న లిఖిత పూర్వ‌క ఫిర్యాదు చేశారు. దీంతో మ‌హేష్ – వంశీపైడిప‌ల్లి సినిమా ఇబ్బందుల్లో ప‌డింది. ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టి వ‌ర‌కూ వంశీ నోరు మెద‌ప‌లేదు. చ‌ట్ట‌ప‌రంగా ఎలాంటి స్టెప్ తీసుకోవాలా అనే ఆలోచ‌న‌లో వంశీపైప‌డిల్లి ఉన్న‌ట్టు టాలీవుడ్ టాక్‌. ద‌ర్శ‌కుల సంఘం వంశీకి మ‌ద్ద‌తుగా నిలిచింద‌ని, కొంత‌మంది హీరోల్నీ ఈ విష‌యంలో మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని అడ‌గడానికి వంశీ సంప్ర‌దిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నాగార్జున నుంచి త‌న‌కు అభ‌య హ‌స్తం అందిద‌ని మ‌హేష్ బాబు కూడా సానుకూలంగా ఉన్నాడ‌ని తెలుస్తోంది.

ఎవ‌రెన్ని అడ్డంకులు సృష్టించినా నీతో ఈ క‌థ‌తోనే సినిమా చేస్తా.. అని మ‌హేష్ వంశీపైడిప‌ల్లికి మాట ఇచ్చాడ‌ట‌. దాంతో వంశీ కాస్త రిలాక్స్ అయ్యాడ‌ని స‌మాచారం. ఈ విష‌యం దాస‌రి దృష్టికీ తీసుకెళ్లాడ‌ని, సంప్ర‌దింపుల‌తో ఈ ఇష్యూని క్లోజ్ చేయాల‌ని దాస‌రి స‌ల‌హా ఇచ్చార‌ని, కావాలంటే మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌డానికి త‌న‌కెలాంటి అభ్యంత‌ర‌మూ లేద‌నన్నార‌ని తెలుస్తోంది. దాస‌రి, నాగార్జున‌, మ‌హేష్‌బాబు త‌న వెనుక ఉండ‌డంతో… వంశీ ధైర్యంగానే క‌నిపిస్తున్నాడు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ మీడియా ముందుకు రాలేదు. ఇష్యూని పెద్ద‌ది చేసుకోవ‌డం ఇష్టంలేకే.. వంశీ కామ్‌గాఉన్నాడ‌ని. త్వ‌ర‌లోనే ఈ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చాక అప్పుడు వంశీ మాట్లాడ‌తాడ‌ని తెలుస్తోంది.

వంశీపైడిప‌ల్లికి మ‌హేష్ అండా దండా?
0 votes, 0.00 avg. rating (0% score)