మంచు ల‌క్ష్మి క్లాప్ తో ప్రారంభ‌మైన మంచు మ‌నోజ్ కొత్త సినిమా

మంచు ల‌క్ష్మి క్లాప్ తో ప్రారంభ‌మైన మంచు మ‌నోజ్ కొత్త సినిమా

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్  పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా          ‘నా రాకుమారుడు’ చిత్ర దర్శకుడు S.K. సత్య దర్శకత్వంలో రూపొందుతున్న  నూతన చిత్రానికీ సంబధించి  ఈ రోజు ఉదయం ప్రొడక్షన్ ఆఫీస్  లో పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది.. ముహూర్తానికి మంచు లక్ష్మి ప్రసన్న  గారు క్లాప్ ని ఇవ్వగా హీరో మంచు మనోజ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.. స్క్రిప్ట్ ని నిర్మాత శ్రీ వరుణ్ అట్లూరి మరియు హీరో బంధువులు దర్శకుడు సత్యకి అందజేసారు..

అనంతరం చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఇది యాక్షన్–లవ్ స్టొరీ జోనర్ లో   పక్కా  మాస్ ఎంటర్ టైనర్ గా పూర్తి కమర్షియల్ అంశాలతో  రూపొందిస్తున్నామని .. ఈ చిత్రం లో హీరో  క్యారెక్టరైజెషన్  విలన్ క్యారెక్టరైజెషన్స్ కొత్తగా వుంటాయని .. సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా

నిలుస్తాయని తెలిపారు.

నిర్మాత శ్రీ వరుణ్ అట్లూరి మాట్లాడుతూ ఈ నెల 17 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి చిన్న చిన్న విరామాలు తప్ప చిత్రం పూర్తయ్యేవరకు ఏకధాటిగా షూటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నాం.. డిసెంబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తామని తెలియచేసారు.

ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా రాజేంద్ర ప్రసాద్ , సంపత్ , కోటశ్రీనివాసరావు , రావు రమేష్ , ప్రవీణ్ , షకలకశంకర్ , సత్య , జెమినీ సురేష్ , కాశీ విశ్వనాథ్  తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం .. సంగీతం:  DJ శ్రీ వసంత్,  సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి,

ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్,  ఫైట్స్ : వెంకట్ , కో– డైరెక్టర్ T. అర్జున్,

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్:  బుజ్జి,  సురేష్ రెడ్డి ,

ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: ప్రభు తేజ,

నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి,

కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య

మంచు ల‌క్ష్మి క్లాప్ తో ప్రారంభ‌మైన మంచు మ‌నోజ్ కొత్త సినిమా
0 votes, 0.00 avg. rating (0% score)