ఓటర్ గా మంచు విష్ణు.. రాజకీయమా..?

టాలీవుడ్ కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు తాజాగా తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని తన కొత్త సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ ను మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఏర్పడటం విశేషం. ఇక ఇదే రోజున మంచు విష్ణు నటిస్తోన్న మరో సినిమా టైటిల్ కూడా బయటకు రావడం ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ కు తెర తీసినట్లు అయింది.

దానికి కారణం ఈ సినిమా పేరు ‘ఓటర్’ కావడమే. ఈ మేరకు ‘అడ్డా’ ఫేమ్ కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో విష్ణు చేస్తోన్న కొత్త సినిమాకు ‘ఓటర్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఇప్పుడు అఫీషియల్ గా ఖరారైపోయింది. అందులోనూ ఈ విషయం తాజాగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ద్వారా తెలియడం విశేషంగా నిలిచింది. అసలు విషయంలోకి వెళితే, తాజాగా విద్యానికేతన్ లో మోహన్ బాబు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇళయరాజా మాట్లాడుతూ.. విష్ణు త్వరలో ‘ఓటర్’ గా పలకరించబోతున్నాడని చెప్పి అందరికీ చిన్న షాక్ ఇచ్చారు.

ముఖ్యంగా ‘ఓటర్’ అనే క్యాచీ టైటిల్ విష్ణు సినిమాకు పెట్టడం, అది జనాలకు ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉండటం బాగానే ఉన్నా.. ఇది రాజకీయాలతో ముడిపడిన సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తుండటంతో పాటు ప్రస్తుత పరిస్థితులతో ‘ఓటర్’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో రావడం అనేది రిస్క్ అనే భావన కలిగిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ పవర్ ఫుల్ పీపుల్ టైటిల్ ‘ఓటర్’ తో మంచు విష్ణు ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ఇకపోతే, ఈ సినిమాలో విష్ణు సరసన బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా ఫేమ్ సురభి హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా తొలిసారి థమన్ మంచు విష్ణు సినిమాకు పనిచేయనుండటం స్పెషల్ అట్రాక్షన్ అనే అనాలి. ఇక ఈ సినిమాను ‘రామా రీల్స్’ బ్యానర్ పై జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్నట్లు సమాచారం.