చిరు సినిమాకి ఎంత మంది రైట‌ర్లు?

many Writers Chiru 151st film
చిరంజీవి న‌టించ‌బోయే 151వ చిత్రం `ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి`కి సంబంధించిన ప‌నులు ఊపందుకొన్నాయి. ఆగ‌స్టులోనే సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని డిసైడ‌య్యారు. దాంతో స్క్రిప్టు ప‌నుల్లో వేగం పెంచేశారు. చిరంజీవి 150వ సినిమాకి ప‌నిచేసిన ప‌లువురు ర‌చ‌యిత‌లు, చిరు 151వ సినిమాకీ ప‌నిచేస్తుండ‌డం విశేషం. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, వేమారెడ్డితో పాటు ఇంకా న‌లుగురైదుగురు ర‌చ‌యిత‌లు ఈ సినిమాకి చేస్తున్నారు.  భారీ బ‌డ్జెట్‌తో సినిమాని తీయాల‌ని నిర్ణ‌యించారు కాబ‌ట్టి, తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆ మేర‌కు కొద్దిమంది త‌మిళ ర‌చ‌యిత‌ల్ని కూడా టీమ్‌లో ఉంచుకొని స్క్రిప్టుని త‌యారు చేయిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఒకొక్క రైట‌ర్ ఒక్కో వెర్ష‌న్ డైలాగుల్ని త‌యారు చేసి ఇచ్చాక‌, ఫైన‌ల్‌గా వాట‌న్నిటినీ చూసుకొని బెస్ట్ అనిపించిన డైలాగ్స్‌ని సినిమాలో వాడాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌లే రైట‌ర్ల టీమ్‌ని చిరంజీవి క‌లుసుకొని ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆప్‌డేట్ బ‌య‌టికి రాబోతోంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. `ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి తెర‌కెక్కించబోతున్న సంగ‌తి