సినీ కెరీర్ బాగోపోతే చైతూ ప్లాన్ ఏంటో తెలుసా?

Naga Chaitanya Business Interests without movies

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. కెరీర్ పరంగా ఈ మధ్య సూపర్ హిట్ అందుకుని యూత్ లో బాగానే క్రేజ్ తెచ్చుకున్న చైతూ.. పర్సనల్ లైఫ్ లోనూ సమంతతో పెళ్ళికి రెడీ అవుతూ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడేమో తన లేటెస్ట్ మూవీ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ను రిలీజ్ కు రెడీ చేసి ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడేలా ఉందని వార్తలు వినిపిస్తున్నా.. ముందుగా అనుకున్న డేట్ కే ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్ననే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన చైతూ ఇప్పుడు ప్రమోషన్స్ లో బిజీ అవుతూ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అలరిస్తున్నాడు.
అందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి, తదుపరి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడిన చైతూ.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పి స్వీట్ షాక్ కూడా ఇచ్చాడు. ముఖ్యంగా నా కష్టాన్ని నేను నమ్ముకుంటానని చెప్పిన చైతూ.. నా ఫిల్మ్ కెరీర్ ఏమైనా బాగోపోతే, సరిగా సాగకపోతే నాకు ఇష్టమైన రెస్టారెంట్ బిజినెస్ గాని, ఆటోమొబైల్ బిజినెస్ గాని చేసుకుంటానని తేల్చి చెప్పేయడం హాట్ టాపిక్ అయింది. ముందుగా కెరీర్ లో చేసిన సినిమాలు, ఫ్యాన్స్ నుంచి దక్కిన అభిమానం లేకుంటే నేను ఎక్కడ ఉంటానో ఊహించుకోవడానికే భయంగా ఉందన్న చైతూ.. తర్వాత ఈ మధ్య నేను చేసిన సినిమాల నుంచి చాలా నేర్చుకున్నానని, ఏమైనా అక్కినేని కుటుంబంలో పుట్టడం నా అదృష్టమని, అలా అని దానిపై నేను ఆధారపడలేదని నాగచైతన్య స్పష్టం చేశాడు. ఏదిఏమైనా, ఈ ఇంటర్వ్యూ పేరు చెప్పి చైతూ బిజినెస్ ల మీద తన ఇంట్రెస్ట్ ను బాగానే బయటపెట్టాడు. ప్రధానంగా సినీ కెరీర్ ఏమైనా సరిగా లేకుంటే.. ప్లాన్ బి అన్నట్లుగా ఆ బిజినెస్ లు చేసుకుంటానని చెప్పడం నిజంగా విశేషమే మరి.