మోక్షజ్ఞ పై ఆ వార్తలు.. నిజమేనా..?

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడిగా సినీరంగ ప్రవేశం చేయడానికి మోక్షజ్ఞ రెడీగా ఉన్నాడని ఆ మధ్య వార్తలు ఓ రేంజ్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలయ్య బ్లాక్ బాస్టర్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దగ్గర మోక్షజ్ఞ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో.. ఆ తర్వాత మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుందని భారీగానే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ముందుగా ఓ క్లాస్ సినిమాతో త్రివిక్రమ్ డైరెక్షన్లో మోక్షజ్ఞ అరంగేట్రం ఉంటుందని వార్తలు వస్తే.. ఆ తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నాడని, కాదు కాదు సాయి కొర్రపాటి ప్రొడక్షన్లో క్రిష్ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని జోరుగానే వార్తలు హల్ చల్ చేశాయి.
ఇందులో ఏదీ ఇప్పటికీ నిజం కాకపోగా.. ఇప్పుడు ఉన్నట్టుండి ఓ షాకింగ్ న్యూస్ మోక్షజ్ఞ గురించి చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయంలోకి వెళితే, ప్రస్తుతం యాక్టర్ కావాలనే ఇంట్రెస్ట్ మోక్షజ్ఞకు లేదని, సినిమాతో సంబంధం లేకుండా ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాడని ఇన్నర్ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా మోక్షజ్ఞ తెరంగేట్రం ఇప్పుడప్పుడే ఉండదని, అసలు నటనలో తనకంతగా ఆసక్తి లేదని కొంచెం గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ వార్తలు అసలు నిజమేనా అనే వాదన కూడా ఇప్పుడు గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే, ముంబైలోని ఒక ప్రముఖ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ మోక్షజ్ఞ యాక్టింగ్ అండ్ స్టంట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇక ఇప్పుడేమో లాస్ ఏంజెల్స్ వెళ్లి అక్కడ కూడా ఒక ఏడాది శిక్షణ తీసుకోవాలని మోక్షజ్ఞ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. కానీ, రూమర్ రాయుళ్లు మాత్రం ఇప్పుడు మోక్షజ్ఞ తన అక్క బ్రాహ్మిణి, బావ లోకేష్ తరహాలో బిజినెస్ రంగంలో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో ఏమైనా నిజం ఉందేమో ముందుముందు చూడాలి. ఇప్పుడు మాత్రం నందమూరి ఫ్యాన్స్ ఈ వార్తలు నిజం కాకూడదని కోరుకుంటున్నారు.