atrk

ఈ రూమర్లు వింటే దిల్ రాజు నిజంగా అప్పు చేస్తారేమో..!

స్టార్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతూనే డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ హిట్స్ కొడుతున్న దిల్ రాజుకు ఈ మధ్య నిర్మాతగా సరైన సక్సెస్ లు దక్కడంలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా దిల్ రాజు చుట్టూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయ్. ఈ మధ్య తీసిన సినిమాలు దిల్ రాజును ఆర్థికంగా దెబ్బతీశాయని, దీంతో ఫైనాన్షియర్ల దగ్గర అప్పు చేసి సినిమా తీస్తున్నారని ఆ రూమర్ల సారాంశం. అసలు విషయంలోకి వెళితే, శర్వానంద్ హీరోగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ‘శతమానం భవతి’ అనే సినిమా తాజాగా దిల్ రాజు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు అప్పు చేసి నిర్మిస్తున్నారని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా ‘శతమానం భవతి’ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ సత్యరంగయ్య క్లాప్ కొట్టడం, ఆయన మనవడు రంగ యశ్వంత్ కెమెరా స్విచ్ఛాన్ చేయడం, ఆయన తనయుడు ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించడం వంటి కారణాలు చూపిస్తూ ఈ సినిమాకు వీళ్ళు ఫైనాన్స్ చేశారని, దిల్ రాజు అప్పు చేశారంటూ వెబ్ మీడియాలో కథనాలు వస్తుండటం గమనార్హం. అయితే, దిల్ రాజు మాత్రం ఈ సినిమా కథ మూడు తరాలకు సంబంధించినదని, అందుకే మాకు బాగా కావాల్సిన సత్య రంగయ్య గారు, ఆయన కుమారుడు, మనవడు చేతుల మీదుగా సినిమాను లాంచ్ చేశామని చెబుతున్నారు. అయినా సరే రూమర్లకు ఫుల్ స్టాప్ పడకుండా దిల్ రాజు ఈ సినిమాను అప్పు చేసే నిర్మిస్తున్నారని వార్తలు హల్ చల్ చేస్తుండటం విశేషం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గాని.. దిల్ రాజు మాత్రం మరోసారి తనదైన ఫైనాన్షియల్ మేటర్ తో వార్తల్లో ప్రధానంగా నిలిచినట్లు అయింది. ఇకపోతే శర్వానంద్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ ‘శతమానం భవతి’ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడే ప్రకటించేశారు.

ఈ రూమర్లు వింటే దిల్ రాజు నిజంగా అప్పు చేస్తారేమో..!
0 votes, 0.00 avg. rating (0% score)