వావ్.. కన్నడ అవార్డుల రేసులో ఎన్టీఆర్

NTR Nominated Kannada Filmfare
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మెప్పిస్తాడనే విషయం తెలిసిందే. నటుడిగా అయితే ఇప్పటికే అనేక అవార్డులను కూడా గెలుచుకున్న ఎన్టీఆర్.. సింగర్ గా అయితే పెద్దగా అవార్డుల గురించి ఏమీ పట్టించుకోకుండా సింగింగ్ ఓ హాబీలా అప్పుడప్పుడూ పాడుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే అప్పుడెప్పుడో ‘యమదొంగ’లో ఓలమ్మీ తిక్కరేగిందా అనే పాటతో సింగర్ అవతారం ఎత్తిన ఎన్టీఆర్.. రీసెంట్ గా ఫాలో ఫాలో అంటూ దుమ్మురేపేశాడు.
ఈ మధ్యలోనే ఓ కన్నడ సాంగ్ కూడా పాడేసిన ఎన్టీఆర్.. అందులో భాగంగానే ఈ ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఓ కొత్త రకమైన నామినేషన్ దక్కించుకోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. ఆ స్టోరీలోకి వెళితే, నటుడిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు తొలిసారిగా ఓ గాయకుడిగా అవార్డు రేసులో నిలిచి ఆశ్చర్యపరిచాడు. అది కూడా ఓ కన్నడ సినిమా కోసం పాడిన పాటకు గాను అక్కడ ఫిల్మ్ ఫేర్ అవార్డు రేసులో నిలవడమే అసలైన విశేషం. ఇంతకూ మేటర్ ఏంటంటే.. ఇటీవల కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘చక్రవ్యూహ’ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట పాడిన విషయం తెలిసే ఉంటుంది.
థమన్ సంగీత సారథ్యంలో సాగిన ‘గెలయా గెలయా’ అనే ఆ పాట అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎనర్జిటిక్ సింగింగ్ కి కన్నడ జనాలు ఫిదా అయిపోయారు. అందుకే ఇప్పుడు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీలో ఎన్టీఆర్ ఫిల్మ్ ఫేర్ నామినేషన్ దక్కించుకున్నాడు. ఇక ఈ అవార్డును ఎన్టీఆర్ గెలుచుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి నిజంగానే కన్నడలో బెస్ట్ సింగర్ గా ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటే.. అది ప్రత్యేకంగా నిలిచిపోతుందనే అనాలి. ఏదిఏమైనా, అవార్డు వచ్చినా రాకపోయినా.. తొలిసారిగా ఎన్టీఆర్ గాయకుడిగా ఫిల్మ్ ఫేర్ నామినేషన్ దక్కించుకోవడం, అది కూడా కన్నడ భాషలో పోటీ పడి కావడం అరుదైన ఘనతని ఒప్పుకోవాల్సిందే. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఈ న్యూస్ ఫుల్ కిక్ ఇస్తోంది.