పవన్ ఫ్యాన్స్పై పగ తీర్చుకొంటున్నారా??

మెగా ఫ్యాన్స్ మ‌ధ్య అంత‌ర్యుద్ధం రోజు రోజుకీ కొత్త కొత్త పుంత‌లు తొక్కుతోంది. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అనే ఒకే ఒక్క డైలాగ్ తో ప‌వ‌న్ ఫ్యాన్స్ బ‌న్నీ పై కోపం పెంచుకొన్నారు. ఆ కోపాన్ని ర‌క‌ర‌కాల రూపాల్లో ప్ర‌ద‌ర్శిస్తూనే వ‌స్తున్నారు. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ టీజ‌ర్‌తో ఆ కోపం ప‌తాక స్థాయి చేరింది. టీజ‌ర్ బాగానే ఉన్నా, దానికి డిజ్ లైక్స్ కొడుతూ బ‌న్నీపై త‌మ కోపాన్ని చాటుకొన్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్. డీజేకొచ్చిన డిజ్ లైక్స్ టాలీవుడ్‌లో ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వంతు వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాట‌మ‌రాయుడుపై త‌మ కోపాన్ని చూపించుకొంటున్నారు బ‌న్నీ ఫ్యాన్స్‌.

కాట‌మ‌రాయుడు ట్రైల‌ర్ ఇటీవ‌లే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ట్రైల‌ర్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. యూ ట్యూబ్‌లో కొత్త రికార్డులు కొట్టే దిశ‌గా అడుగులేస్తోంది కాట‌మ‌రాయుడు ట్రైల‌ర్‌. అయితే ఈ ట్రైల‌ర్‌కి వ‌స్తున్న డిజ్ లైక్స్ కూడా రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజే దాదాపు 40 వేల‌కు పైగా డిజ్ లైక్స్ వ‌చ్చాయి. యాంటీ వ‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ల్లే ఈ డిజ్ లైక్స్ అనేదిప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌రి ఈ డిజ్ లైక్స్ ఎక్క‌డి వ‌రకూ వెళ్లి ఆగుతాయో అనేది ఆస‌క్తిగా మారింది. ఈ గొడ‌వ ఇక్క‌డితో ఆగేలా లేదు. రేపో మాపో.. డీజే ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. అప్పుడు ఇంత‌కు ఇంత‌.. ప‌వ‌న్  ఫ్యాన్స్ రెచ్చిపోవ‌డం ఖాయం.