‘వివేగం’ పై పవన్ కన్ను పడిందా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’ ను రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో తన కొత్త సినిమాను పట్టాలెక్కించనున్న పవన్.. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో తమిళ డైరెక్టర్ నీసన్ తో ఓ సినిమాను స్టార్ట్ చేసి హోల్డ్ లో పెట్టి ఉంచాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత 2019 ఎన్నికల లోపు పవన్ ఇంకో రెండు సినిమాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, నీసన్ ల తర్వాత పవన్ ఎవరి డైరెక్షన్లో సినిమా చేస్తాడు? ఏం సినిమా చేస్తాడు? అనే విషయాలపై గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం పవన్ ఏం సినిమా చేయబోతున్నాడనే దానిపై కొంత క్లారిటీ వచ్చినట్లేనని టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తుండటం విశేషం.

అయితే, అది కూడా తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాయే కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఇప్పటికే అజిత్ సూపర్ హిట్ సినిమా ‘వీరమ్’ ను ‘కాటమరాయుడు’ గా తీసిన పవన్.. నీసన్ డైరెక్షన్లో అజిత్ మరో సూపర్ హిట్ సినిమా ‘వేదాళం’ ను రీమేక్ చేయబోతుండటమే. ఇలా వరుసగా రెండు అజిత్ సినిమాలను రీమేక్ చేస్తోన్న పవన్.. ఇప్పుడు అజిత్ మూడో సినిమాపై కన్నేయడం అంటే అది నిజంగా షాకింగ్ న్యూసే అవుతుంది. ఇంతకూ మేటర్ ఏంటంటే.. త్రివిక్రమ్, నీసన్ మూవీల తర్వాత ఏ సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న పవన్ అండ్ టీమ్ తాజాగా స్టోరీ విషయంలో ఓ క్లారిటీకి వచ్చేసరికి తాజా ఫిలిం నగర్ టాక్. ఆ స్టోరీలోకి వెళితే, అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘వివేగం’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసే ఉంటుంది.
స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 10న రిలీజ్ కానుండగా.. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా స్టిల్స్, అజిత్ లుక్స్ ఓ రేంజ్ లో ఎట్రాక్ట్ చేశాయి. అందుకే ఇప్పుడు పవన్ చూపు ‘వివేగం’ పై పడిందని.. కాన్సెప్ట్ నచ్చేలా ఉండటంతో రీమేక్ చేయాలని చూస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పుడు ఎంత నచ్చేలా ఉన్నా.. రేపు ‘వివేగం’ సినిమా రిలీజ్ అయ్యాకే, హిట్ టాక్ తెచ్చుకుంటేనే అప్రోచ్ కావాలని పవన్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇదే సమయంలో ఫ్యాన్స్ ఇక్కడే ఓ విషయం గురించి సీరియస్ గా ఆలోచించేస్తున్నారు. నిజంగా పవన్ ‘వివేగం’ సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటే మాత్రం.. అప్పుడు అజిత్ లా సిక్స్ ప్యాక్ చేస్తాడా? అంటూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ ఏజ్ లో కూడా అజిత్ ‘వివేగం’ లోని క్యారెక్టర్ కోసం వావ్ అనిపించేలా సిక్స్ ప్యాక్ చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. మరి పవన్ కు సిక్స్ ప్యాక్ చేయడం పెద్ద కష్టం కాదనుకోండి.. కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో అది సాధ్యమవుతుందా? అన్నదే చాలామంది ఆలోచన.