ప్రభాస్ – రాజమౌళి.. డైరెక్ట్ బాలీవుడ్ సినిమా..?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఏ ముహూర్తాన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘బాహుబలి’ స్టార్ట్ చేశాడో గాని, అది ఇప్పుడు నేషనల్ ప్రోడక్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇంతకుముందు వీరిద్దరూ ‘ఛత్రపతి’ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తీస్తే.. ఇప్పుడు ఊహకందని విధంగా ‘బాహుబలి ది కంక్లూజన్’ తో వచ్చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ – రాజమౌళి కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందా అంటే.. చెప్పడం కొంచెం కష్టమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నేళ్ల వరకు వీళ్ళిద్దరూ కలిసి పనిచేసే అవకాశమే లేదని అర్థమవుతుంది.

కానీ, ఆ అసాధ్యాన్ని ఇప్పుడే సుసాధ్యం చేయాలని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆలోచన అని తెలియడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ స్టోరీలోకి వెళితే, ఇప్పుడు ‘బాహుబలి-2’ రిలీజ్ తర్వాత కొన్నిరోజులు రెస్ట్ తీసుకుని అనంతరం ఓ చిన్న సినిమా తీయాలనే ప్లాన్ లో రాజమౌళి ఉన్నాడనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిన్న సినిమానే రాజమౌళితో ప్రభాస్ హీరోగా డైరెక్ట్ హిందీ సినిమా చేయించాలని కరణ్ జోహార్ పెద్ద ప్లానే వేస్తున్నాడట. దానికోసం ఇప్పటికే ప్రయత్నాలు, బలవంతాలు కూడా మొదలెట్టేశాడని తాజా ఇన్నర్ టాక్.
ముఖ్యంగా ఈ సినిమా ప్రభాస్ కు బాలీవుడ్ లాంచింగ్ మూవీ చేయాలని కరణ్ జోహార్ చూస్తుండటమే విశేషం. ఈ విధంగా కరణ్ జోహార్ నిర్మాతగా, రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా డైరెక్ట్ బాలీవుడ్ సినిమా అంటే.. హిస్టరీలో నిలిచిపోవడంతో పాటు ఎక్కడలేని క్రేజ్ వస్తుందని ప్రణాళికలు రచిస్తున్నారట. అంతేకాదండోయ్.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో కాకుండా  ఓ మీడియం బడ్జెట్ లో యాక్షన్ అండ్ రొమాంటిక్ జోనర్ లో తీయాలని కరణ్ జోహార్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో అటు చిన్న సినిమా తీసి ఊపిరి పీల్చుకోవాలనే రాజమౌళి కోరిక కూడా తీరుతుందని లెక్కలు వేస్తున్నారట. కానీ, దీనికి ఇప్పుడు ప్రభాస్ – రాజమౌళి లు ఒప్పుకుంటారా? అంటే.. అది మిలియన్ డాలర్ ప్రశ్నే. ఇది ఇప్పుడు కాకపోయినా, ఫ్యూచర్ లో గ్యారెంటీగా ఓకే అవుతుందని చెప్పొచ్చు.