కరణ్ జోహార్ తో రామ్ చరణ్ సీక్రెట్ డీల్..?

Ram Charan Tieup Karan Johar 
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం తొలిసారి నిర్మాతగా మారి ‘ఖైదీ నెంబర్ 150’ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతకుమించి అనేలా చిరు 151వ సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ని చెర్రీ సెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గా ‘బాహుబలి-2’ సక్సెస్ చూశాక ఉయ్యాలవాడ బడ్జెట్ ను చెర్రీ అమాంతం పెంచేశాడని, సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఉండటానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా తెప్పిస్తున్నాడని వార్తలు వినిపించిన విషయం తెలిసే ఉంటుంది.
ఇక ఇప్పుడేమో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఉయ్యాలవాడను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోన్న చెర్రీ.. దానికోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడని తెలియడం విశేషం. ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను హిందీలో పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలన్నా, అక్కడి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తించాలన్నా అంత సులభం కాదని తెలుసుకున్న చెర్రీ.. దానికోసం ఏకంగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నే టార్గెట్ చేశాడని తాజా ఫిల్మ్ నగర్ టాక్. ఆ స్టోరీలోకి వెళితే, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బేనర్ మీద టాలీవుడ్ ‘బాహుబలి’ ని భారీ స్థాయిలో రిలీజ్ చేసి, హిందీ జనాలు బాహుబలిని తమ సొంత సినిమాగా భావించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
అందుకే ఇప్పుడు తన ఉయ్యాలవాడ సినిమా కోసం కరణ్ జోహార్ ను రామ్ చరణ్ సంప్రదిస్తున్నాడట. ఈ నేపథ్యంలో అమ్మకపు హక్కులు, వాటాల గురించి పెద్దగా పట్టింపులు లేకుండా కేవలం కరణ్ జోహార్ ద్వారా మెగా సినిమాను భారీ స్థాయిలో హిందీలో రిలీజ్ చేయించాలనే పట్టుదలతో చెర్రీ ఉన్నాడని సమాచారం. ఈ మేరకు కరణ్ తో చెర్రీ డీల్ కూడా సెట్ చేసేశాడని తెలుస్తోంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ కూడా దీనికి సానుకూలంగానే స్పందించాడట. ఇదిలా ఉంటే, ఇప్పటికే బాహుబలి ది బిగినింగ్, ఘాజి, బాహుబలి ది కంక్లూజన్ అంటూ సౌత్ సినిమాలను అంతకుమించి అనేలా హిందీలో కరణ్ జోహార్ సూపర్ హిట్ చేయించాడు. మరి ఇప్పుడు మెగా సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ని కూడా కరణ్ హిందీలో రిలీజ్ చేస్తే.. మెగా సినిమా మరో మెట్టు పైకెక్కుతుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.