క‌న్‌ఫామ్ : చిరు 151.. చ‌ర‌ణ్ చేతికే

 
చిరంజీవి ప్ర‌తిష్టాత్మ‌క 150వ చిత్రాన్ని నిర్మించే ఛాన్స్ కొట్టేశాడు రామ్ చ‌ర‌ణ్‌. ఈ సినిమా చేయాల‌ని చాలా మంది క‌ర్చీఫ్‌లు వేసుకొన్నారు. అందులో అల్లు అర‌వింద్‌, అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజులాంటి హేమా హేమీలున్నారు. అయితే.. వారంద‌ర్నీ ప‌క్క‌న పెట్టి, చ‌ర‌ణ్ చేతికి ప‌గ్గాలు అప్ప‌గించాడు చిరు. ఇప్పుడు సేమ్ టూ సేమ్ 151వ చిత్రానికీ చిరు అదే ప్లాన్ వేశాడు. ”నాన్న‌గారి త‌దుప‌రి సినిమా కూడా నేనే ప్రొడ్యూస్ చేస్తా” అని చ‌ర‌ణ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. ఇప్పుడు చిరు కూడా అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ‘నా 151వ సినిమాని కూడా చ‌ర‌ణ్ ప్రొడ్యూస్ చేస్తాడు. 152 కి మాత్రం అల్లు అర‌వింద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు’ అంటూ డిసైడ్ చేసేశాడు చిరు.
 
చిరు 151వ సినిమాకి ప్రొడ్యూస్ చేయాల‌ని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు అర‌వింద్‌. కొన్ని వేదిక‌ల‌పై కూడా ఇదే మాట చెప్పాడు. ‘150వ సినిమా చేసే అవ‌కాశం చ‌ర‌ణ్‌కి ద‌క్కింది. 151 మాత్రం నేనే చేస్తా’ అన్నాడు. బోయ‌పాటి శ్రీ‌నుకీ అడ్వాన్సులు ఇచ్చేశాడు అర‌వింద్‌. అయితే అది కూడా అనూహ్యంగా అర‌వింద్ చేయి దాటి పోయింది. కాక‌పోతే బోయ‌పాటి – చిరు – అర‌వింద్ కాంబినేష‌న్ మాత్రం ఖాయ‌మే. చిరు 152వ సినిమా ఇదే కాంబినేష‌న్‌లో రాబోతోంది.  ”నేను 150 సినిమాలు చేసినా ఎప్పుడూ చిత్ర నిర్మాణం గురించి ఆలోచించ‌లేదు. కానీ చ‌ర‌ణ్ మాత్రం త‌న 9వ సినిమాకే నిర్మాత అయిపోయాడు. తాను భ‌విష్య‌త్తులో మంచి నిర్మాత‌గా పేరు తెచ్చుకొంటాడు” అని చ‌ర‌ణ్‌కి చిరు కితాబులు ఇచ్చేస్తున్నాడు. అందుకే 151 కూడా చ‌ర‌ణ్‌కే అప్ప‌గించాడు చిరు.