స్టార్ హీరోతో ఉన్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా?

Ranbir Kapoor romancing mystery girl taking Internet storm

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్ లో హీరోగా నటిస్తోన్న విషయం తెలిసే ఉంటుంది. ఓవైపు ఇలా ఉంటే, మరోవైపు మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ తో చేసిన ‘జగ్గా జాసూస్’ సినిమాను రణబీర్ రిలీజ్ కు రెడీ చేసి ఆకట్టుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో రణబీర్ ఓ అమ్మాయితో హాట్ హాట్ గా కనిపించడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. దానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో.. ఆ అమ్మాయి ఎవరనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మిస్టరీ గర్ల్ తో రణబీర్ రొమాన్స్ అంటూ ఆ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఇదిలా ఉంటే, బయటకొచ్చి ప్రస్తుతం హల్ చల్ చేస్తోన్న ఈ ఫోటోలు ఓ యాడ్ షూట్ కు సంబంధించినవి అని తెలుస్తోంది.

ఒక కొత్త అమ్మాయితో స్టార్ హీరో కాస్త ఇంటిమేట్ సీన్స్ తో షూట్ చేసిన ఈ యాడ్ త్వరలోనే బయటకొస్తుందని అంటున్నారు. ఈలోపు ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసుకోవడానికి బీటౌన్ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అయితే, ఆ అమ్మాయి కొత్తగా మోడలింగ్ రంగంలోకి వచ్చిన టాలెంటెడ్ బ్యూటీ అని తెలుస్తోంది. ఏదిఏమైనా, ఓ కొత్త బ్రాండ్ కు ప్రకటనలో భాగంగా చేసిన షూట్ కు సంబంధించి ఫోటోలు బయటకు రావడంతో.. ఓ అమ్మాయికి ఊహించని క్రేజ్ రావడం చూస్తుంటే.. త్వరలోనే ఆ బ్యూటీ కెరీర్ వెలిగిపోనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే, ఇదే యాడ్ కు సంబంధించి రణబీర్ లుక్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. ముఖ్యంగా సంజయ్ దత్ పాత్ర కోసం 13 కేజీల బరువు కూడా పెరిగిన రణబీర్.. ఇప్పుడు నిజంగానే తాజా ఫోటోల్లో పర్ఫెక్ట్ బాడీతో ఫిట్ గా కనిపించడం మెస్మరైజ్ చేస్తోంది. మొత్తానికి స్టార్ హీరోయిన్స్ తో బ్రేకప్ చేసుకున్న తర్వాత రణబీర్ కపూర్ ఇప్పుడు ఓ కొత్త అమ్మాయితో ఇంత రొమాంటిక్ గా, హాట్ గా.. ఇంటిమేట్ సీన్స్ తో కూడిన ఫోటోల్లో కనిపించడం చాలామందికి కొత్త కిక్ ఇస్తోంది.