వైరల్ గా మారిన నాగ్ – సమంతల ఛాటింగ్

 

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు అక్కినేని సమంత గానే ఎక్కువ పాపులర్ అయిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నవ యువ సామ్రాజ్ నాగచైతన్యతో ప్రేమాయణం, నిశ్చితార్థం తర్వాత సమంత తెలుగింటి కోడలు అయిపోయింది. ఇక త్వరలోనే చైతూ-సమంతల పెళ్లి కూడా జరిగిపోనుండటంతో.. ఈ అనురాగాలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కింగ్ నాగార్జున మరోసారి సమంతతో ఉన్న అనుబంధాల చిట్టాను విప్పారు. ఆ స్టోరీలోకి వెళితే, వాట్సాప్ లో సమంతతో జరిపిన ఛాటింగ్ కు సంబంధించి ఇమేజ్ ను తాజాగా నాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ముఖ్యంగా కోడలు సమంతతో మామ నాగ్ జరిపిన సంభాషణ అక్కినేని ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.

అదంతా కూడా చైతూ లేటెస్ట్ మూవీ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ పై జరిగిన చర్చ కావడం విశేషం. ముందుగా ఈ తాజా ట్రైలర్ కు సినీ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తుండటంతో.. సమంతకి ‘కంగ్రాట్స్ కోడలా’ అంటూ వాట్సాప్ లో నాగ్ సందేశం పంపారు. అనంతరం దానికి రిప్లై ఇచ్చిన సమంత.. ‘ట్రైలర్ నాకూ బాగా నచ్చింది.. తను సూపర్ గా కనిపిస్తున్నాడు.. తప్పకుండా సినిమా మంచి విజయం సాధిస్తుంది.. నాకు చాలా సంతోషంగా ఉంది.. థాంక్స్ అండ్ లవ్ యు మామ’ అంటూ ఆకట్టుకుంది. దీంతో ఈ ఛాటింగ్ ను చూస్తోన్న నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా కోడలా అంటూ నాగ్.. మామా అంటూ సమంత సంభోదించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఇలాంటి అందమైన విషయాలపై తన స్పందనను సోషల్ మీడియా లాంటి పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ ల మీద పెట్టడం చైతూకు పెద్దగా ఇష్టం లేకపోవడం ఫ్యాన్స్ కు కాస్త బాధ కలిగిస్తోంది. అయితే, ఇటు మామతో పాటు కోడలు కూడా సోషల్ మీడియాలో ప్రేమను ఇలా అందంగా పరిచేస్తుంటే.. చైతూ కూడా హ్యాపీగానే ఫీలవుతున్నాడట.