యూరప్ లో ‘శ్రీమంతుడు’ సీక్వెల్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘స్పైడర్’ అనే టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేయగా.. ఈ ఏప్రిల్ నెలాఖరు నాటికి షూటింగ్ మొత్తం పూర్తి కానుందని సమాచారం. ఇక ఆ తర్వాత మే మొదటి వారం నుంచి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను మహేష్ స్టార్ట్ చేయనున్నాడని తాజా ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాకు ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ను ఆల్రెడీ ఫిక్స్ చేయగా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకొచ్చి హాట్ టాపిక్ కు తెర తీశాయి.

ఆ విషయంలోకి వెళితే, మహేష్ – కొరటాల మూవీని యూరప్ లో ప్రారంభించనున్నారట. ప్రధానంగా లండన్ లోనే కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు మహేష్ కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను తెరకెక్కించనున్నారట. అయితే, మహేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను యూరప్ లో తీసినా.. ఈ సినిమా స్టోరీ మొత్తం హైదరాబాద్ బేస్డ్ గానే ఉంటుందట. కేవలం కొన్ని కీలకమైన సీన్స్ మాత్రమే యూరప్ లో తీస్తారట. దీనికోసమే ఇప్పుడు అక్కడ లొకేషన్స్ ను ఫైనలైజ్ చేసే పనిలో కొరటాల శివ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని షాకింగ్ అప్డేట్స్ సినీ సర్కిల్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ముఖ్యంగా ఇందులో మహేష్ ఓ లండన్ రిటర్న్ మిలియనీర్ గా కనిపించనున్నాడని, దీంతో ఇది ‘శ్రీమంతుడు’ సీక్వెల్ గా ఉంటుందని వార్తలు హల్ చల్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఈ సినిమాలోనూ హీరోయిన్ గా శృతిహాసన్ నే తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడని.. ‘శ్రీమంతుడు’ కాంబోనే రిపీట్ చేయాలని భావిస్తున్నాడని వార్తలు వినిపిస్తుండటం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలో ఈ సిల్వర్ స్క్రీన్ శ్రీమంతుడు ఈసారి యూరప్ నుంచి ఇండియాకు, పుట్టిన ఊరుకి వచ్చి దేశానికి సేవ చేస్తాడని.. ఆ విధంగా శ్రీమంతుడు లానే.. ఓ రకంగా సీక్వెల్ లానే ఈ ‘భరత్ అను నేను’ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే. మరోవైపు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే కొరటాల శివతో కలిసి మహేష్ కోసం కొన్ని పాటలు సిద్ధం చేసేసినట్లు అఫీషియల్ ప్రకటించేయడం విశేషం.