సెక్స్ కు దైవత్వం మిక్స్ చేస్తోన్న హీరోయిన్

Sofia Hayat posts new pics third wedding
బాలీవుడ్ లో సెక్స్ బాంబ్ గా ఫేమస్ అయిపోయిన హాట్ బ్యూటీ సోఫియా హయత్ ఈ మధ్య షాక్ ల మీద షాక్ లు ఇస్తోన్న విషయం తెలిసిందే. ముందుగా సినిమాలు వదిలేసి తనను తాను దేవతగా అభివర్ణించుకుని సన్యాసినిగా మారానని ప్రకటించి షాక్ ఇచ్చిన సోఫియా.. ఇటీవల తన రొమేనియా బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుని పెద్ద షాకే ఇచ్చింది. అనంతరం తన భర్తతో ఇంటిమేట్ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టి బాగానే కలకలం రేపింది. ఇక ఇప్పుడేమో అంతకుమించి అనేలా.. సెక్స్, భావిప్రాప్తి లాంటి అంశాలకు దైవత్వం మిక్స్ చేస్తూ సరికొత్త పాఠాలు వల్లిస్తోంది. ఈ మేరకు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సోఫియా హయత్ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి.
ముందుగా ఇప్పుడు తనను ‘అల్లా మా’ అని చెప్పుకున్న సోఫియా.. సెక్స్ అంటే దైవత్వమేనని, గాడ్ ఈజ్ సెక్సువల్ అంటే భావప్రాప్తి అనేది దైవ శక్తి అని తెలిపింది. అంతేకాకుండా శివుడు, అల్లా, జీసస్ అంటూ మూడు మతాలకు చెందిన దేవుళ్లను ప్రస్తావిస్తూ.. తన్మయత్వం అంటే దేవుడి శక్తి అని, అల్లా మా శక్తి అన్నింటినీ సృష్టించిందని, అలాగే ఓం అని పలుకుతున్నప్పుడు ఈ ప్రపంచాన్నే సృష్టించామనే తన్మయత్వం కలుగుతోందని సోఫియా హయత్ పేర్కొంది. అదేవిధంగా మా కలయిక సమయంలో పవిత్రమైన లైంగిక సంభోగంలో సృష్టించే శక్తి లభించిందని, అది చాలా పవిత్రమైనదని.. ఆ పవిత్రమైన తన్మయత్వమే దైవ శక్తి అని సోఫియా హయత్ ఏదోదో చెప్పేసింది. మొత్తంగా సెక్స్ కు దైవత్వం మరియు ఆధ్యాత్మికతను మిక్స్ చేసి సోఫియా బాగానే జనాలను ఇబ్బంది పెట్టేసిందని చెప్పొచ్చు. ఇదే అనుకుంటే, దీనికి తగ్గట్లు తన బాయ్ ఫ్రెండ్ కమ్ భర్త తో దిగిన పర్సనల్ ఫోటోలను పోస్ట్ చేయడం సోఫియా హయత్ కే చెల్లింది.