వాస్తు, రెమ్యునరేషన్ గొడవలతో శ్రీనువైట్ల

srinu vaitla house vasthu mister movie remuneration story

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా టాప్ పొజిషన్ ను బాగానే ఎంజాయ్ చేసిన శ్రీనువైట్ల ఈ మధ్య ఆగడు, బ్రూస్ లీ లాంటి భారీ డిజాస్టర్ లతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి నిలబడతాడనుకుంటే.. వరుణ్ తేజ్ ‘మిస్టర్’ తో మొత్తం పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ లేటెస్ట్ మూవీ కూడా భారీ డిజాస్టర్ గా నిలవడంతో ఇప్పుడు శ్రీనువైట్ల కెరీర్ కోలుకోలేని కష్టాల్లో పడింది. దీంతో ఇదే టైమ్ అన్నట్లు ఇప్పుడు శ్రీనువైట్ల గురించి కొన్ని షాకింగ్ న్యూస్ లు సినీ సర్కిల్  లో హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ‘మిస్టర్’ సినిమాకు సంబంధించి శ్రీనువైట్ల రెమ్యునరేషన్ గురించి ఓ షాకింగ్ రూమర్ వినిపిస్తుంది.

అదేంటంటే.. ఈ ‘మిస్టర్’ కథను నిర్మాతలకు చెప్పినప్పుడే తనకు రెమ్యునరేషన్ వద్దని చెప్పిన శ్రీనువైట్ల.. తనకివ్వాలనుకుంటున్న మొత్తాన్ని కలుపుకుని ‘మిస్టర్’ ను లావిష్ గా తెరకెక్కిస్తానని, సినిమా సూపర్ హిట్ అయితే వచ్చే లాభాల్లో అప్పుడు రెమ్యునరేషన్ తీసుకుంటానని ప్రపోజల్ పెట్టాడట. ఈ ప్రతిపాదన నచ్చడంతోనే నిర్మాతలు ‘మిస్టర్’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారని, కానీ తర్వాత కథకు న్యాయం చేసే క్రమంలో నిర్మాతల చేత శ్రీనువైట్ల లెక్కకు మించి ఖర్చు పెట్టించాడని ప్రచారం జరుగుతోంది. దీంతో భారీగా పెరిగిపోయిన బడ్జెట్ తో ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ ను బేరీజు వేసుకుంటే.. వచ్చిన నష్టాలు చూసి నిర్మాతలు షాక్ కు గురయ్యారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని.. ప్రస్తుతం ఈ రెమ్యునరేషన్ గొడవ శ్రీనువైట్లకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు.

ఓవైపు ఇలా ఉంటే, మరోవైపు శ్రీనువైట్ల ఇలా ఫ్లాపులతో పాతాళానికి పడిపోవడం వెనుక ఇంటి వాస్తు ప్రధాన కారణం అంటూ వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. ఆ స్టోరీలోకి వెళితే, శ్రీనువైట్ల ‘ఆగడు’ సినిమా అప్పుడు జూబ్లీహిల్స్ లోని కొత్త ఇంటిలోకి వెళ్ళాడట. ఇక ఆ టైమ్ లో ‘ఆగడు’ ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో అందరికీ తెలుసు. అనంతరం వాస్తులో కొన్ని మార్పులు చేసినా కూడా పెద్దగా కలిసి రాలేదని.. తర్వాత వచ్చిన బ్రూస్ లీ కూడా ఫ్లాప్ అయిందని సన్నిహితులు అంటున్నారు. ఇక ఇప్పుడు అదే కంటిన్యూ అవుతూ ‘మిస్టర్’ కూడా ఫ్లాప్ అవడంతో.. ఇంకా వాస్తు అనుమానం నిజమని శ్రీనువైట్ల నమ్మే స్థితికి వచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్తలు వింటున్న కొందరు.. ఎంచుకునే కథలో మంచిగా మార్పులు చేయడం లేదా మంచి కథలను ఎంచుకుంటే సినిమాలు హిట్ అవుతాయి గాని.. ఇలా వాస్తులో మార్పులు చేస్తేనో లేక లావిష్ గా తీస్తేనో కాదని కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటన్నింటి నుంచి శ్రీనువైట్ల ఎలా బయటపడతాడో చూడాలి.