పూరీ తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన వెంకీ..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం బాలయ్యతో సీరియస్ గా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీనికంటే ముందు మరో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో పూరీ సినిమా ఉంటుందని టాక్ వచ్చింది గాని.. అది పట్టాలెక్కలేదు. ముఖ్యంగా మహేష్ తో తీయాలనుకున్న ‘జన గణ మన’ నే వెంకీతో తీయాలని పూరీ ప్లాన్ చేశాడని, కానీ బడ్జెట్ సమస్యలతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని అనుకున్నారు. కానీ, ఇప్పుడు తాజా ఇన్నర్ టాక్ ప్రకారం తెలుస్తుందేమిటంటే.. పూరీ – వెంకీ ప్రాజెక్ట్ ఆగిపోలేదట. ప్రస్తుతానికి కొన్నిరోజులు హోల్డ్ లో పెట్టారట. మరోవైపు, వెంకీ ఈ మధ్యలో డైరెక్టర్ క్రిష్ తో అనుకున్న ప్రాజెక్ట్ గాని.. డైరెక్టర్ కిషోర్ తిరుమలతో ప్లాన్ చేసిన ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమా గాని పట్టాలెక్కకపోవడం వల్ల పెద్దగా బాధపడటం లేదట.

ప్రస్తుతం సదరు డైరెక్టర్లు ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ కాగా, ఇటు వెంకీ మాత్రం వేరే ఏమీ ఆలోచించకుండా పూరీ చెప్పిన దేశభక్తి స్టోరీ పైనే ఫోకస్ పెట్టారట. అంతేకాకుండా ఇప్పుడు తన కొత్త సినిమాను పూరీ తోనే చేయాలని వెంకీ ఫిక్స్ అయ్యాడట. ఈ విషయంపై స్వయంగా వెంకీ యే తాజాగా క్లారిటీ ఇచ్చాడని తాజా ఫిలిం నగర్ టాక్. అయితే, పూరీ రీసెంట్ గా బాలయ్య సినిమాను స్టార్ట్ చేయడంతో.. మధ్యలో వెంకీ మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నా కూడా పట్టించుకోవడం లేదట. ఎందుకంటే సహజంగా సమ్మర్ లో సినిమాలు చేసే అలవాటు వెంకీకి లేదట. ఈ లెక్కన జులై వరకు వెంకీ షూటింగ్ లలో పాల్గొనడని తెలుస్తోంది. ఇక అప్పటికి బాలయ్యతో పూరీ తెరకెక్కిస్తున్న సినిమా చివరి దశకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మంచి టైమ్ చూసుకుని పూరీ డైరెక్షన్లో తనకు నచ్చిన దేశభక్తి చిత్రాన్ని ప్రారంభించాలని వెంకీ అనుకుంటున్నాడట.మరి అన్నీ అనుకున్నట్లే జరిగితే.. ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్టింగ్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.