కొడుక్కి స్నేహితుడి పేరు పెట్టిన యంగ్ హీరో..!

కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ తాజాగా ఊహించని విధంగా ఫ్యాన్స్ కు స్వీట్ షాక్ ఇచ్చాడు. ఆ మాటకొస్తే.. ఆ స్వీట్ షాక్ అందరికీ షాకింగ్ అండ్ సర్ప్రైజ్ గానే అనిపిస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్లేముందు, విష్ణు విశాల్ రెండు నెలల క్రితం తండ్రి అయిన విషయాన్ని ఓసారి గుర్తుచేసుకోవాలి. ఈ క్రమంలో వారసుడు పుట్టిన సంతోషంలో మునిగితేలుతున్న ఈ యంగ్ హీరో.. తాజాగా ట్విట్టర్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ తన కొడుక్కి పేరు పెట్టిన విషయం గురించి కావడం విశేషం. అయితే, ఇక్కడే విష్ణు విశాల్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.

ముందుగా.. ‘నా రాక్ స్టార్ ను మీకు పరిచయం చేస్తున్నాను. నా వారసుడికి ఆర్యన్ అని పేరు పెట్టాను’ అని రాసి కోలీవుడ్ యంగ్ హీరో ఆర్యకి ట్యాగ్ చేసి విష్ణు విశాల్ స్వీట్ షాక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత అదే పోస్ట్ లో.. ‘నీకు సంతోషమేనా?, నీ కోరికను నేను నెరవేర్చాను.. నా కొడుక్కి నీ పేరు పెట్టమన్నావుగా’ అంటూ హీరో ఆర్య ను ఉద్దేశించి పేర్కొనడం కోలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే, కోలీవుడ్ యంగ్ హీరోలుగా రాణిస్తున్న ఆర్య – విష్ణు విశాల్ లు ఎప్పట్నుంచో మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలుసు. కానీ, తన వారసుడికి స్నేహితుడి పేరు పెట్టేంతగా వీరి మధ్య స్నేహం ఉందని తెలిసి ఇప్పుడు కోలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే, విష్ణు – రజని దంపతులకు మొన్న జనవరి 30వ తేదీన పండంటి మగబిడ్డ పుట్టడం జరిగింది. అప్పుడు ఈ నట వారసుడు అందరికీ ఆనందాన్ని పంచితే.. ఇప్పుడు మాత్రం ఆర్యన్ అనే పేరుతో చిన్నపాటి షాకే ఇచ్చాడని అనుకోవాలి.