అబ్బెబ్బే క‌హానీకి కాపీ కాదు!

Last Updated on by

మంచు కాంపౌండ్‌లో మేటి ప్ర‌తిభావ‌నిగా పేరు తెచ్చుకుంది ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌. హోస్ట్‌, న‌టి, నిర్మాత ఇలా అన్ని విభాగాల్లో గొప్ప ప్ర‌తిభ‌ను చూపించారు ప్ర‌స‌న్న‌. అందుకే తాను ఏం చేసినా టాలీవుడ్ స‌హా కామ‌న్ జ‌నం ఆస‌క్తిగా ప‌రిశీలిస్తారు. ముఖ్యంగా బుల్లితెర‌పై ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ప్ర‌జాప్ర‌యోజ‌క కార్య‌క్ర‌మాలు త‌న‌కు మ‌రింత గుర్తింపు తెచ్చాయి. మేము సైతం, ల‌క్ష్మీ టాక్ షో వంటివి త‌న‌కు ఇమేజ్ పెంచాయ‌న‌డంలో సందేహం లేదు. ఇక‌పోతే సినిమాల కెరీర్ మాత్రం అంతంత‌గానే సాగుతోంది.

అయితే ఇక్క‌డ త‌న ఉనికిని చాటుకునే తెలివితేట‌లు మాత్రం త‌న సోద‌రుల్ని మించి త‌న‌కు ఉన్నాయ‌ని ల‌క్ష్మీ నిరూపించారు. మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర పోషించిన `వైఫ్ ఆఫ్ రామ్` ఈ వారంలో రిలీజ్‌కొస్తోంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ల‌క్ష్మీకి ఓ చిక్కు ప్ర‌శ్న ఎదురైంది. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైల‌ర్ చూడ‌గానే క‌హానీ గుర్తొస్తోంది క‌దా? అక్క‌డ త‌ప్పిపోయిన భ‌ర్త‌ను వెతుక్కుంటున్న భార్య‌, ఇక్క‌డా సేమ్ టు సేమ్ క‌నిపిస్తోంది.. అన్న ప్ర‌శ్న‌కు ల‌క్ష్మీ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. ఆ రెండు సినిమాల‌కూ ఎలాంటి పోలికా లేదు. రెండూ భార్య‌ల క‌థ‌లే .. ఆ ఒక్క విష‌యంలో త‌ప్ప దేనిలోనూ పోలిక లేద‌ని క్లారిటీ ఇచ్చారు ల‌క్ష్మీ మంచు. తల్లిదండ్రులు చిన్నప్పుడే మ‌ర‌ణిస్తే బాబాయ్ ఇంట్లో పెరిగిన ధీక్ష అనే అమ్మాయి తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుని.. హ్యాపీగా ఉంటోన్న టైమ్ లో ఊహించ‌ని రీతిలో స‌డెన్ ట్విస్టేంటి? అటుపై ఆ స‌మ‌స్య‌ను ఎలా సాల్వ్ చేసుకుంది అన్న‌ది తెర‌పైనే చూడాల‌ని ల‌క్ష్మీ తెలిపారు.

User Comments