ఎన్టీఆర్ నే పిలుస్తానంటున్న నాని

Last Updated on by

బిగ్ బాస్ సీజ‌న్ 2 మ‌రో వారం రోజుల్లో మొద‌లు కానుంది. నాని ఎలా చేస్తాడో అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ షోకు సంబంధించిన ప్రెస్ మీట్ ఒక‌టి జ‌రిగింది. ఇందులో నాని మాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తాను బిగ్ బాస్ షో చూడ‌లేదు అని చెప్పి షాక్ ఇచ్చాడు న్యాచుర‌ల్ స్టార్. ఇప్ప‌టికీ చూడ‌లేద‌ని.. కాక‌పోతే తెలుసుకున్నాన‌ని చెప్పాడు ఈ హీరో. అయితే ఎక్క‌డికి వెళ్లినా కూడా ఎన్టీఆర్ మాదిరి చేస్తాడా.. అత‌న్ని మ‌రిపిస్తాడా అని అడుగుతున్నారని కానీ త‌నకు కూడా ఈ షో ఎలా ఉండ‌బోతుందో క్లారిటీ లేద‌న్నాడు ఈ హీరో.

మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్ మాదిరి వంట‌లు చేయ‌డం త‌న‌కు రాద‌ని.. కావాలంటే మ‌రోసారి ఈ షోకు తార‌క్ ను పిలిచి చికెన్ చేయిద్దాం అంటూ న‌వ్వులు పూయించాడు నాని. జూన్ 10 నుంచి మొద‌లయ్యే ఈ షో 100 రోజుల పాటు జ‌గ‌ర‌నుంది. ఇందులో 16 మంది సెలెబ్రెటీస్ పాల్గొంటారు. మ‌ధ్య‌లో స‌ర్ ప్రైజ్ ఎంట్రీలు కూడా ఉండ‌బోతున్నాయి. మొత్తానికి.. తాను ఎన్టీఆర్ లా చేయ‌లేను అని ముందే ఒప్పుకుంటున్న నాని ఏ రేంజ్ లో ఈ షోను ర‌క్తి క‌ట్టిస్తాడో మ‌రి..?

User Comments