చిట్టిబాబుకు దెబ్బేసిన లింగం మామ?

 

ప‌ద్మ పుర‌స్కారాల విష‌యంలో ఎవ‌రు లాబీయింగ్ చేస్తే వారినే ప‌ద్మ పుర‌స్క‌రాలు వ‌రిస్తాయ‌ని గ‌తంలో చాలా మంది తెలుగు దిగ్గ‌జాలు బాహాటంగానే విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. జాతీయ పుర‌స్కారాల్లోనూ అదే త‌ర‌హా లాబీయింగ్ ప్ర‌భావాన్ని చూపుతోంద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ 66 జాతీయ పుర‌స్కారాల్ని చూస్తే అర్థ‌మ‌వుతోంది. అర్హుల‌తో పాటు అనుకూలంగా వున్నవారికి అవార్డుల్ని పంచేశార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్‌కు ఈ అవార్డుల్లో అన్యాయం జ‌రిగింద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నారు.

ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ చిత్రం విష‌యంలో `మ‌హాన‌టి` చిత్రానికి, కీర్తి సురేష్‌కు అవార్డులు ద‌క్కినా ఉత్త‌మ న‌టుడు విష‌యానికి వ‌చ్చే స‌రికి అన్యాయం చేశార‌ని బాహాటంగానే అవార్డు క‌మిటీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఉత్త‌మ న‌టుడు విభాగంలో `అంధాధున్‌` చిత్రానికి గానూ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు అవార్డు ఇచ్చారు. ఓకే కానీ విక్కీ కౌష‌ల్ కు కూడా ఉత్త‌మ న‌టుడు విభాగంలో అవార్డు ప్ర‌క‌టించ‌డ‌మే బాగాలేదు. `యురి` చిత్రానికి గానూ విక్కీకౌశ‌ల్ని ఉత్త‌మ న‌టుడుగా ప్ర‌క‌టించారు. అసలు ఆ అవార్డు ద‌క్కాల్సింది `రంగ‌స్థ‌లం` చిత్రానికి గానూ రామ్‌చ‌ర‌ణ్‌కి. `యురి` చిత్రంలో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు పాత్ర‌లో న‌టించిన ప‌రేష్ రావెల్ చ‌క్రం తిప్ప‌డం వ‌ల్లే రామ్‌చ‌ర‌ణ్‌కు ద‌క్కాల్సిన పుర‌స్కారం విక్కీకౌశ‌ల్‌కు కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా ప‌రేష్ రావెల్ బీజేపీకి వీర విధేయుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ కార‌ణంగానే ఆయ‌న వ‌ల్లే రామ్‌చ‌ర‌ణ్‌కు ద‌క్కాల్సిన అవార్డుని విక్కీకి కేటాయించిన‌ట్లు స్ప‌ష్ట‌మౌతోంది. స్టార్ హీరోల్లో ఈ మ‌ధ్య కాలంలో ఆ స్థాయి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించిన హీరో ఎవ‌రూ లేరు. చిట్టిబాబు పాత్ర‌లో అత్యుత్త‌మ న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించిన రామ్ చ‌రణ్ ని ప‌క్క‌న పెట్ట‌డం వెన‌క ప‌రేష్ రావెల్ రాజ‌కీయం చేసిన‌ట్టుగా క‌నిపిస్తోందని టాలీవుడ్ సెల‌బ్రిటీలు జాతీయ అవార్డుల క‌మిటీపై దుమ్మెత్తిపోస్తున్నారు.

Also Read : Us Box Office Collections