చిరు కోస‌మేనా ఈ హార్స్ రైడింగ్..?

Last Updated on by

సైరా షూటింగ్ జ‌రుగుతున్న కొద్దీ సినిమాపై కొత్త కొత్త విష‌యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం నిండా స్టార్స్ ఉన్నారు. మ‌ల్టీస్టార‌ర్ కే మ‌ల్టీస్టార‌ర్ గా మారిపోయింది సైరా. చిరంజీవితో పాటు అమితాబ్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్ లాంటి స్టార్స్ ఉన్నారు ఈ చిత్రంలో. ఇక న‌య‌న‌తార‌, త‌మ‌న్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా సైరాలో జోడీ క‌ట్ట‌బోతుంద‌ని తెలుస్తుంది. కాలాలో ర‌జినీ ప్రేయ‌సిగా న‌టించిన హ్యూమాఖురేషి సైరాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతుంద‌ని వార్త‌లు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ముంబైలో ఈ భామ గుర్ర‌పుస్వారి నేర్చుకుంటుంది. ఇది చిరు కోస‌మే అని తెలుస్తుంది. సౌత్ సినిమాల‌పై బాగానే దృష్టి పెట్టింది హ్యూమా. మొత్తానికి.. సైరా పూర్త‌య్యేలోపు ఇంకెంతమంది స్టార్స్ యాడ్ అవుతారో..?

User Comments