నాని హీరోగా కళ్యాణ్ రామ్ సినిమా.. నిజమేనా

Natural star Nani film Nandamuri Kalyan Ram

టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ప్రస్తుతం సినీ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అది కూడా నేచురల్ స్టార్ నాని హీరోగా, నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా కావడం విశేషం. ప్రస్తుతం హీరోగా కళ్యాణ్ రామ్ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని భారీ అట్టర్ ఫ్లాప్ సినిమాలతో నిర్మాతగా ఇబ్బందుల్లో పడిపోయిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు తన కష్టాలన్నీ ‘జై లవ కుశ’ తోనే గట్టెక్కుతాయని బోలెడు ఆశలతో ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్మాతల పాలిట హీరోగా, అస్సలు నష్టాలే తెచ్చిపెట్టని నేచురల్ స్టార్ గా దూసుకుపోతున్న నానితో సినిమా చేయాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, రీసెంట్ గా ‘నిన్ను కోరి’ తో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయ్) అనే సినిమా చేస్తున్నాడు. ఇదే సమయంలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ‘కృష్ణార్జున యుద్ధం’ అనే సినిమాను నాని లైన్ లో పెట్టేశాడు. ఇక ఇప్పుడు వీటి తర్వాతే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమా చేసేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజా సమాచారం. అయితే, ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదని సమాచారం. మరి ఇదే నిజమైతే, సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న నాని ఏ రేంజ్ లో కళ్యాణ్ రామ్ ను లాభాల బాట పట్టిస్తాడో చూడాలి. ఏదిఏమైనా, ఎన్టీఆర్ తో కలిసి ఖచ్చితంగా ఓ సినిమా చేస్తానని నాని రీసెంట్ గా ప్రకటించడం బాగానే ఉంది అనుకుంటున్న టైమ్ లో.. ఇలా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోనే ఓ సినిమా చేసేందుకు ముందుకు రావడం నిజంగా విశేషమే.