నోటా రివ్యూ

రివ్యూ: నోటా

నటీనటులు : విజయ్‌ దేవరకొండ, మెహ్రీన్‌, సంచనా నటరాజన్‌ సత్యరాజ్‌, నాజర్‌, ప్రియదర్శి తదితరులు

దర్శకత్వం : ఆనంద్‌ శంకర్‌

నిర్మాతలు : జ్ఞానవేల్‌ రాజా

సంగీతం : సి యస్‌ సామ్‌

సినిమాటోగ్రఫర్‌ : యస్‌ క ష్ణ రవిచంద్రన్‌

ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

వరుణ్‌ (విజయ్‌ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవన్‌ (నాజర్‌) పెద్ద కుమారుడు. వాసుదేవన్‌ తన పై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసులో భాగంగా.. తన సీఎం పదవికి రాజీనామా చేసి.. రాత్రికి రాత్రికే అస్సలు రాజకీయాల గురించి, కనీస అవగాహన కూడా లేని వరుణ్‌ ని సీఎం ని చేస్తాడు. వరుణ్‌ తన తండ్రి ఆదేశాల ప్రకారం డమ్మి ముఖ్యమంత్రిగా మేనేజ్‌ చేస్తుంటాడు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య, వరుణ్‌ కొన్ని సమస్యలను ఎదురుక్కోవాల్సి వస్తోంది. దాంతో వరుణ్‌ ప్రతిపక్ష నేత మహేంద్ర (సత్యరాజ్‌) సహాయంతో ఆ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరిస్తాడు.

కాగా ఆ తర్వాత జరిగే పొలిటికల్‌ డ్రామాలో వరుణ్‌ కి ఎదురైనా సమస్యలు ఏమిటీ ? అసలు వాసుదేవన్‌ (నాజర్‌) వరుణ్‌ ని ఏ ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు? వరుణ్‌ తండ్రికి విరోధి అయి ఉండి కూడా మహేంద్ర (సత్యరాజ్‌) వరుణ్‌ కి ఎందుకు సాయం చేస్తుంటాడు ? మహేంద్రకి, వరుణ్‌ కి ఉన్న సంబంధం ఏమిటి ? రాజకీయాల గురించి అస్సలు తెలియని వరుణ్‌ చివరకి యువ ముఖ్యమంత్రిగా ఏమి సాధిస్తాడు ? ఆ సాధించే క్రమంలో వరుణ్‌ చేసిన పనులు, ప్లాన్‌ లు ఏమిటి ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్‌ పాయింట్స్‌:

వరుస విజయాలతో దూసుకువెళ్తున్న విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో.. విజయ్‌ ఓ యంగ్‌ సీఎం గా చాలా స్టైలిష్‌ గా ఫ్రెష్‌ గా కనిపించాడు. తన మాడ్యులేషన్‌ అండ్‌ తన ట్కెమింగ్‌ తో అక్కడక్కడా.. తన మార్క్‌ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తూనే.. ఇటు సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ తోనూ విజయ్‌ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక ఓ జర్నలిస్ట్‌ పాత్రలో నటించిన హీరోయిన్‌ మెహ్రీన్‌ కు పెద్దగా స్క్రీన్‌ టైం కూడా లేదు. ఆమె పాత్ర కేవలం సపోర్టింగ్‌ రోల్‌ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది. ఫిమేల్‌ లీడ్‌ లో మరో కీలక పాత్రలో కనిపించిన సంచనా నటరాజన్‌ యువ రాజకీయ నాయకురాలిగా తన నటనతో కట్టిపడేస్తోంది.

ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ లో కనిపించిన సత్యరాజ్‌ తన నటనతో ఆకట్టుకుంటారు. ఆయన తన ఎక్స్‌ ప్రెషన్స్‌ తో.. కొన్ని ఏమోషనల్‌ సీన్స్‌ తో పాటు, పొలిటికల్‌ డ్రామా సీన్స్‌ ను కూడా చాలా బాగా పండించారు. ఇక ఎప్పటిలాగే నాజర్‌ తన గాంభీరమైన నటనతో మరియు విక తమైన గెటప్‌ తో ఆకట్టుకోగా%ౌౌ% కమెడియన్‌ ప్రియదర్శి హీరో ఫ్రెండ్‌ గా, హీరోకి హెల్ప్‌ చేసే సపోర్టింగ్‌ రోల్‌ లో బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

మైనస్‌ పాయింట్స్‌:

దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్‌ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్‌ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్‌ హాఫ్‌ లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, సెకెండాఫ్‌ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్‌ గా అనిపిస్తాయి.

పైగా సినిమాలో తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్‌ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. నాజర్‌, సత్యరాజ్‌ ల మధ్య ప్లాష్‌ బ్యాక్‌ మరియు చివర్లో సత్యరాజ్‌ రివీల్‌ చేసే ట్విస్ట్‌ కూడా ఆడియన్స్‌ కి ముందే తేలిసిపోతుంది. క్లైమాక్స్‌ కూడా చాలా సింపుల్‌ గా ముగించిన ఫీలింగ్‌ కలుగుతుంది.

ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్‌ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్‌ ని ఎంటర్‌ టైన్‌ చేసే దానికన్నా, తను అనుకున్న పొలిటికల్‌ డ్రామాని ఎలివేట్‌ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా కాన్‌ ఫ్లిక్ట్‌ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్‌ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్‌ కి తగ్గట్లు సరైన కథ కథనాలని రాసుకోలేకపోయారు. ఉన్న కంటెంట్‌ ను ఆనంద్‌ శంకర్‌ స్క్రీన్‌ పై ఆసక్తి కరంగా మలచలేకపోయారు. సి యస్‌ సామ్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ పర్వాలేదనిపిస్తోంది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం అస్సలు ఆకట్టుకోవు.

యస్‌. క ష్ణ రవిచంద్రన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్‌ గా, మంచి విజువల్స్‌ తో చాలా బ్యూటిఫుల్‌ గా చూపించారు. రేమండ్‌ ఎడిటింగ్‌ బాగుంది కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్‌ అయ్యేది. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

చివ‌ర‌గా:

ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘నోటా’ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్‌ తీసుకున్నప్పటికీ.. ఆ రాజకీయాల్లో ఎదురయ్యే కొన్ని నాటకీయ పరిణామాలను, సమస్యలను ఆసక్తికరంగా చూపించలేకపోయారు.

కథనం కూడా నెమ్మదిగా సాగుతూ బోర్‌ కొట్టిస్తోంది. పైగా సినిమాలో తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. మొత్తానికి విజయ్‌ దేవరకొండ నటన ఆకట్టుకున్నా.. సినిమా ఆకట్టుకోదు. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయినా ఈ ‘నోటా’ చిత్రం ఓవరాల్‌ గా నిరుత్సాహపరిచినా సినిమాలోని కొన్ని అంశాలు విజయ్‌ అభిమానులను ఆకట్టుకోవచ్చు.

రేటింగ్: 2.5/5.0

విడుదల తేదీ : అక్టోబర్‌ 05, 2018