న‌రేష్ కొత్త ప్ర‌యాణానికి నాంది

కామెడీ ఇమేజ్ నుంచి బ‌య‌టికొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు అల్ల‌రి న‌రేష్‌. `నాంది` సినిమాతోనే అందుకు శ్రీకారం చుట్టాడాయ‌న‌. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌రేష్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఈ రోజే హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ఇదివ‌ర‌క‌టి సినిమాల‌కి పూర్తి భిన్నంగా ఇందులో న‌రేష్ క‌నిపిస్తున్నారు. యాక్ష‌న్ అంశాల‌తో రూపొందుతున్న సినిమా అని ప్ర‌చార చిత్రాల‌న్నిబ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. కొన్నాళ్లుగా ఆయ‌న‌కి కామెడీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. జ‌నాలు ఊహించిన స్థాయిలో ఆయ‌న సినిమాలు న‌వ్వించ‌లేక‌పోతున్నాయి. దాంతో రూటు మార్చ‌డ‌మే బెస్ట్ అని ఆయ‌న న‌మ్మిన‌ట్టున్నారు. అందుకే ఓ కొత్త ఇమేజ్‌తో స‌రికొత్త‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. `నాంది` అనే పేరును కొత్త సినిమాకి ఖ‌రారు చేశారు. మ‌రి ఈ నాంది ఆయ‌న‌కి ఎలాంటి గుర్తింపుని తీసుకొస్తుందో, ఎలాంటి ఇమేజ్‌ని తెచ్చిపెడుతుందో చూద్దాం.