ప‌వ‌న్‌కి మిత్ర‌ద్రోహం?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ – క‌మెడియ‌న్ అలీ స్నేహం, సాన్నిహిత్యం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. ప‌వ‌న్ న‌టించే ప్ర‌తి సినిమాలో అలీ త‌ప్ప‌నిస‌రి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహానికి గుడుంబా సాక్ష్యం ఉంది. అయితే అలీ ఉన్న‌ట్టుండి త‌న స్నేహితుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి దూరంగా ఉంటూ వైయస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌న్నిహితంగా మెల‌గ‌డంపై ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఎన్నిక‌ల వేళ అలీ ఇలా చేస్తున్నాడేంటి? అలీ మిత్ర ద్రోహి. ప‌వ‌న్ కి ద్రోహం చేసి జ‌గ‌న్ పంచ‌న చేరాడంటూ జ‌న‌సైనికులు తిట్టేస్తున్నారు.

వాస్త‌వానికి జన‌సేన‌లో చేరి రాజ‌మండ్రి నుంచి అలీ పోటీ చేస్తాడ‌ని భావిస్తే ఉన్న‌ట్టుండి అత‌డు ఇలా చేశాడేంటి? అంటూ ప‌వ‌న్ అభిమానుల్లో ఆవేద‌నా క‌నిపిస్తోంది. అయితే సినిమాలు వేరు.. రాజ‌కీయాలు వేరు. ఇక్క‌డ స్నేహం అక్క‌డ వ‌ర్క‌వుటు కాద‌నే అలీ భావించి ఇలా చేశాడా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక రాబోవు ఏపీ ఎన్నిక‌ల్లో సెల‌బ్రిటీల మ‌ద్ధ‌తు జ‌గ‌న్ కి పెరుగుతోంది. ఇప్ప‌టికే 30 ఇయ‌ర్స్ పృథ్వీ జ‌గ‌న్ పార్టీకి బోలెడంత ప్ర‌చారం చేస్తూ ఏకంగా బాల‌య్యనే తిట్టేస్తున్నాడు. ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల గురించి కూడా క‌ల‌త చెంద‌డం లేద‌ని, త‌న‌కు ఛాన్సులిచ్చేవాళ్లు ఇస్తూనే ఉంటార‌ని అన్నాడు. మ‌రి అలీ ఇప్పుడు రాజకీయాల‌పై ప‌డ్డాడు కాబ‌ట్టి, ఇక తాను ఎంచుకున్న మార్గంలోనే వెళుతున్నాడ‌ని భావించ‌వ‌చ్చు. ఇక జ‌న‌సేనాని ఆఫీస్ ప్రారంభించిన‌ప్పుడు త‌న‌ని క‌లిసి ఒక స్నేహితుడిగా ఓ కానుక‌ను ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.