ఫ‌స్ట్‌లుక్‌: ర‌గులుతున్న జ్వాల

త‌మ‌న్నా జ్వాలారెడ్డిగా సంద‌డి చేయ‌బోతోంది. ప్ర‌తి సినిమాలోనూ త‌న అందచందాల‌తో ఆక‌ట్టుకుంటూ కుర్రాళ్ల‌తో ఒక ఆట ఆడుకునే ఆమె… ఈసారి ఏకంగా ఆట కోసమే రంగంలోకి దిగుతోంది. క‌బ‌డ్డీ కోచ్ పాత్ర‌లో ఆమె వినోదాలు పంచ‌బోతోంది. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న `సీటీమార్‌`లో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. క‌బ‌డ్డీ కోచ్ జ్వాలారెడ్డి అనే పాత్ర‌లో ఆమె క‌నిపించ‌బోతోంది. ఆ పాత్ర‌కి సంబంధించిన లుక్‌ని తాజాగా విడుద‌ల చేశారు. అందులో త‌మ‌న్నా ఆవేశంతో , ర‌గులుతున్న జ్వాల‌లాగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఆమె మార్క్ అందం కూడా కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. గోపీచంద్ కూడా ఇందులో క‌బ‌డ్డీ కోచ్‌గానే క‌నిపిస్తారు. వేస‌వి సంద‌ర్భంగా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.

Tamana