మ‌హానాయ‌కుడు రిలీజ్ సందిగ్ధ‌త‌?

Last Updated on by

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌తో క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు చిత్రాల్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న క‌థానాయ‌కుడు, రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 25న మ‌హానాయ‌కుడు రిలీజ్ చేయనున్నామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్రిష్‌, బాల‌య్య ప్ర‌క‌టించారు. అయితే క‌థానాయ‌కుడు రిలీజ్ విష‌య‌మై ఎలాంటి అభ్యంత‌రాలు లేక‌పోయినా, మ‌హానాయ‌కుడు రిలీజ్ విష‌య‌మై అభిప్రాయ భేధాలు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది.

మ‌హానాయ‌కుడు చిత్రాన్ని క‌థానాయ‌కుడు రిలీజైన రెండు వారాల‌కే రిలీజ్ చేస్తే ఆ మేర‌కు పంపిణీదారుల‌తో ఇబ్బంది త‌ప్ప‌ద‌ని బాల‌య్య క్రిష్‌తో వాదించార‌ట‌. అయితే ఆ విష‌యం త‌న‌కు వ‌దిలేస్తే స‌మ‌స్య‌ను స‌రిదిద్దుతాన‌ని క్రిష్ మాటివ్వ‌డంతో డిస్క‌ష‌న్ స‌ద్దుమ‌ణిగింద‌ని తెలుస్తోంది. పంపిణీదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మ‌హానాయ‌కుడు చిత్రాన్ని కేవ‌లం రెండు వారాల గ్యాప్ తో రిలీజ్ చేయ‌డం స‌రికాద‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా రిలీజ్ తేదీ మారింద‌ని, ఫిబ్ర‌వ‌రి 14 న రిలీజ్ చేయ‌నున్నార‌ని ఓ ప్ర‌చారం సాగుతోంది. బ‌య్య‌ర్లు క్రిష్ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టార‌ని చెబుతున్నారు. దాంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో వాయిదా వెయ్య‌క త‌ప్ప‌లేద‌ని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వాయిదాకి సంబంధించి అధికారిక స‌మాచారం రావాల్సి ఉందింకా. మ‌రోవైపు క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు చిత్రాల‌కు ప్రీరిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంద‌న్న సమాచారం ఉంది. ఇక జ‌న‌వ‌రిలో కార్తీ, క‌ళ్యాణ్ రామ్ స‌హా ప‌లువురి చిత్రాలు రిలీజ్‌కి వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ రిలీజ్ తేదీలు మారే ఛాన్సుంద‌ని తెలుస్తోంది.

User Comments