విక్ర‌మ్ మేన‌ల్లుడు తెరంగేట్రం

చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్ తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే లాంచింగ్ పూర్తివ్వాల్సింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ప్రాజెక్ట్ డిలే అయింది. మరికొద్ది రోజుల్లోనే ధృవ్ చియాన్ అభిమానుల‌ను మెప్పించ‌నున్నాడు. అయితే ధృవ్ తో పాటు విక్ర‌మ్ మేన‌ల్లుడు తెరంగేట్రం చేస్తున్నాడు. విక్ర‌మ్ చెల్లి కొడుకు అర్జుమాన్ పొల్ల ఉల‌గిల్ బ‌యంగ‌ర గేమ్ అనే సినిమాతో త‌మిళ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇటీవ‌లే అర్జుమాన్ ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ముఖంలో మామ పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. యాక్టింగ్ అంటే అర్జుమాన్ కి చిన్న నాటి నుంచి ఓ వ్య‌స‌నం అట‌. సినిమాలు చూస్తునే పెరిగాడుట‌. ఆ ఫ్యాష‌న్ ను గుర్తించే విక్ర‌మ్ ప్రోత్స‌హించాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అర్జుమాన్ చిత్రాన్ని విజయ్ శ్రీ.జి తెర‌కెక్కిస్తున్నాడు. జీడీఆర్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. అర్జుమాన్ స‌ర‌స‌న బిగ్ బాస్ ఫేం ఐశ్వర్య దత్తా హీరోయిన్ గా న‌టిస్తోంది. రొమాంటిక్ కామెండీ ఎంట‌ర్ టైన్ అని స‌మాచారం.వార‌త‌స్వం పుణికి పుచ్చుకుని రంగేసుకున్నారు. స‌క్సెస్ అవుతారో? లేదో చూద్దాం.