వినాయ‌క్ మూవీ క్యాన్సిల్ కాలేదా?

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ నిర్మించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకోవ‌డంతో ఆ ప్ర‌భావం అత‌డు న‌టించే త‌దుప‌రి సినిమాల‌పై ప‌డింద‌ని ఇటీవ‌ల మాట్లాడుకున్నారంతా. ఎన్‌బీకే ఫిలింస్ బ్యాన‌ర్ లో తొలి ప్ర‌య‌త్న‌మే ఫెయిల‌వ్వ‌డం సెంటిమెంటుగా బాల‌య్య‌ను హ‌ర్ట్ చేసింద‌ని ఆ క్ర‌మంలోనే త‌దుప‌రి తాను ఎంచుకోబోయే స్క్రిప్టుల విష‌యంలో ఇంకా ఎంతో జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఒక త‌ప్పు ఇంకో త‌ప్పు జ‌ర‌గ‌డానికి తావివ్వ‌కూడ‌దు. సింహం ఒక‌డుగు వెన‌క్కి వేస్తే ప‌ది అడుగులు ముందుకు దూకాల‌నే పంతంతో బాల‌య్య ఉన్నార‌ట‌. అందుకు త‌గ్గ‌ట్టే త‌దుప‌రి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నార‌ని తెలిసింది. అందుకోసం ఇండ‌స్ట్రీ బెస్ట్ ట్యాలెంట్ ని బ‌రిలో దించుతున్నార‌న్న‌ది తాజా అప్ డేట్.

బాలయ్య వరుసగా ఇద్దరు మాస్ డైరెక్టర్స్ తో వ‌రుస‌గా సినిమాలు చేయడానికి వంద శాతం క‌మిట‌య్యార‌న్న‌ది తాజా తాజా షాకింగ్ ట్విస్టు. అందులో ఒక‌రు బోయ‌పాటి శ్రీ‌ను ఎన్నిక‌ల ముందే ఫిక్స్ చేసిన‌ది కాగా…. మ‌రొక‌రు వి.వి.వినాయ‌క్. కొంత‌కాలంగా వినాయ‌క్ తో సినిమాని స్క్రాప్ లో వేశార‌ని ప్ర‌చారం సాగుతున్నా అందులో ఏమాత్రం నిజం లేద‌ని తెలుస్తోంది. బాల‌కృష్ణ ఆ ఇద్ద‌రూ సీనియ‌ర్ ద‌ర్శ‌కుల్ని గౌర‌వించారు. అవ‌కాశం క‌ల్పించారు. వారు విన్న స్క్రిప్టుల్లో మార్పులు చేర్పులు సూచించారు త‌ప్ప కాదు .. వ‌ద్దు అని మాత్రం అన‌లేదు. ఇక బోయ‌పాటితో ఎన్నిక‌ల‌కు ముందే సినిమా ఫిక్స‌య్యింది. అందులో ఎలాంటి మార్పు లేదు. వినాయ‌క్ తో సందేహ‌మే అన్న మాటపై మాత్రం తాజాగా ఇండ‌స్ట్రీకి చెందిన శ‌తాధిక (వంద చిన్న సినిమాలు) చిత్రాల‌ నిర్మాత ఇచ్చిన క్లారిటీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. బాల‌కృష్ణ‌- బోయ‌పాటి సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళుతోంది. ఈ సినిమాని బాల‌కృష్ణ స్వ‌యంగా ఎన్‌బీకే సినిమాస్ ప‌తాకంపై నిర్మిస్తున్నారు. బాల‌కృష్ణ – వి.వి.వినాయ‌క్ – సి.క‌ళ్యాణ్ కాంబినేష‌న్ సినిమాకి ఇదివ‌ర‌కూ కామా పెట్టారు త‌ప్ప ఫుల్ స్టాప్ పెట్ట‌లేదు. ప్ర‌స్తుతం బాల‌య్య ఓకే చేసిన వేరొక కొత్త స్క్రిప్టును తుదిమెరుగులు దిద్దించే ప‌నిలో వినాయ‌క్ ఉన్నార‌ట‌. అందుకోసం ప‌టాస్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు రూపొందించిన ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ అనీల్ రావిపూడి ని బ‌రిలో దించార‌ని తెలుస్తోంది. అనీల్ రావిపూడి ఓవైపు మ‌హేష్ సినిమా కోసం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తూనే వి.వి.వినాయ‌క్ తో క‌లిసి బాల‌య్య స్క్రిప్టు కోసం క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. బాల‌య్య‌కు ఒక‌టి కాదు రెండు సినిమాలు సెట్ట‌యిన‌ట్టే. బోయ‌పాటితో సినిమా మొద‌లైన కొద్ది రోజుల్లో(జూన్-జూలై) నే వినాయ‌క్ తోనూ సినిమాని లాంచ్ చేస్తార‌ని నిర్మాత‌ సి.క‌ళ్యాణ్ కి అత్యంత స‌న్నిహితుడైన శ‌తాధిక చిత్రాల నిర్మాత నుంచి స‌మాచారం అందింది.

Also Watch : Kanchana 3 Movie Pre Release Event Stills